OnePlus 15R: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ తమ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ OnePlus 15 లైవ్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే కొంతమంది టిప్‌స్టర్స్ లీక్ చేసిన వివరాలు మాత్రం టెక్ ప్రేమికుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ టిప్‌స్టర్ ప్రకారం.. OnePlus 15R భారతదేశంలో డిసెంబర్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని.. ఈ ఫోన్ ధర రూ.42,999 వరకు ఉండొచ్చని అంచనా వేసాడు. అంటే కొత్త మోడల్ కూడా రూ. 40–45 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
SSMB 29 : ఈవెంట్ కోసం రాజమౌళి ప్లానింగ్.. సుమ స్పెషల్ వీడియో
చాలామందికి OnePlus 15R అనేది అక్టోబర్ చివరిలో చైనాలో విడుదలైన OnePlus Ace 6 రీబ్రాండెడ్ వెర్షన్‌గానే భావిస్తున్నారు. ఈ OnePlus 15Rలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియమ్ డిస్‌ప్లే లక్షణాలు ఉండే అవకాశం ఉంది. పనితీరును పరంగా చూస్తే.. ఇందులో Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ అందించబడనుంది. ఇక స్టోరేజ్ విషయంలో 16GB వరకు LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ లభించవచ్చు. ఇక బ్యాటరీ క్యాపాసిటీ 7,800mAh గా ఉండే అవకాశం ఉంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ, వైర్‌లెస్ ఛార్జింగ్ అందించకపోవచ్చు. కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా OnePlus Ace 6 చైనాలో ColorOS 16తో వచ్చినప్పటికీ.. OnePlus 15R మాత్రం భారతదేశం, గ్లోబల్ మార్కెట్లలో Android 16 ఆధారిత OxygenOS 16 తో లాంచ్ కావచ్చు.
KTM Recalls: KTM బైక్ వాహనదారులకు అలర్ట్.. కంపెనీ ఈ మోడల్స్ డ్యూక్‌లను రీకాల్.. చెక్ చేసుకోండి
