NTV Telugu Site icon

OnePlus 11R 5G: వన్ ప్లస్ 11R 5జీ వచ్చేసింది.. సూపర్ ఫీచర్స్.. ధర?

Oneplus 11r

Oneplus 11r

యాపిల్ ఫోన్లకు ధీటుగా పోటి ఇస్తున్న ఫోన్లలో వన్ ప్లస్ కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు వచ్చేశాయి. ఇప్పుడు తాజాగా మరో ఫోన్ వచ్చేసింది.. వన్ ప్లస్ 11 ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్ఓసీ, కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.. ఇక ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 6.74-అంగుళాల ఫుల్-హెచ్‌డీతో పాటుగా కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను 40హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 1000హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో సెన్సార్ ను కలిగి ఉంటుంది. త్రిపుల్ కెమెరాను అందిస్తున్నారు.. సెల్ఫీల కోసం ఈ ఫోన్ బెస్ట్ అనే చెప్పాలి. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తుంది.

ఇక ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్+128జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ సోలార్ రెడ్ కలర్‌లో రూ.35,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ లాంచ్ కాగా.. భారత్‌లో గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ వేరియంట్‌లతో పాటు కొత్త వెర్షన్ అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ నిర్ణయించిన ధర రూ. 32,999కు పొందవచ్చు.. ఇంకా ఎక్కువ స్టోరేజ్ తో మరో ఫోన్ రానుందని సమాచారం..