ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది. వన్‌ప్లస్ 10టీ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వన్‌ప్లస్ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. జులై 25 నుంచి ఆగస్ట్ 1 మధ్య వన్‌ప్లస్ 10టీ 5జీ లాంఛ్ కానుందని ఓ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఆగస్ట్ తొలి వారంలో లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ షురూ అవుతాయని నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ భారతదేశంలో అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో ప్రత్యేకంగా విక్రయించబడుతుంది.
Gautam Adani : అదానీ కొత్త బిజినెస్..! అంబానీకి టెన్షన్..!
వన్‌ప్లస్ 10టీ ఫోన్‌కు సంబంధించి కొన్ని కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో సెన్సార్‌లతో ఆకట్టుకోనుంది. ముందుభాగంలో ఫ్లాట్ స్క్రీన్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే, 16ఎంపీ ఫ్రంట్ కెమరా సెన్సార్ వంటి ఫీచర్లను కలిగిఉంది. వన్‌ప్లస్ 10టీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్‌సెట్, 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ 10టీ ఇండియా వేరియంట్ 8జీబీ ర్యామ్ /128జీబీ , 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 10టీ షియామి 12 ప్రొ, ఐఫోన్ 12, వివో ఎక్స్80, రియల్మి జీటీ 2ప్రొ, మోటో ఎడ్జ్ 30 ప్రొ వంటి ప్రీమియం ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.