NTV Telugu Site icon

Ola Electric Car: అదిరిపోయే కార్.. లాంచ్ అప్పుడే!

Ola Electric Car

Ola Electric Car

ఇప్పుడు మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా బాగా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలైతే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లతో రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అటు.. ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తుండడంతో కొత్త స్టార్టప్ కంపెనీలు వరుసగా ప్రొడక్ట్స్‌‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు బేస్డ్ EV స్టార్టప్ ఓలా.. ఎలక్ట్రిక్ 4-వీలర్ ప్రొడక్షన్‌ను ప్రారంభించేందుకు క‌ృషి చేస్తోంది.

జూన్ 19వ తేదీన ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో నిర్వహించిన ‘ఓలా కస్టమర్ డే’ సందర్భంగా.. ఎలక్ట్రిక్ కారు గురించి వివరాలు ఇచ్చింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ సైతం ఈ కారు డిజైన్ మాక్-అప్స్‌ గురించి ట్వీట్ చేశారు. ఈ కారులో 70-80 kWh కెపాసిటీతో పెద్ద బ్యాటరీ ఉంటుంది. S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే.. ఈ ఎలక్ట్రిక్ కారు కూడా మంచి రేంజ్ ఇవ్వాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ధర విషయానికొస్తే.. ఈ ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హై డ్రైవింగ్ రేంజ్‌తో ఈ కారు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ సెడాన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారన్న విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికార సమాచారం లేదు కానీ, ఆగస్టు 15న ఈ కారు గురించి మరిన్ని వివరాల్ని కంపెనీ బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఇది వచ్చే ఏడాదిలో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సీఈఓ షేర్ చేసిన ఫోటోల్లో ఈ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. నాలుగు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, డోర్ హ్యాండిల్స్ లేని ఫినిషింగ్, బ్లాక్ కలర్ రూఫ్, కారు బాడీ చుట్టూ ఎల్‌ఈడీ లైట్ బార్ ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments