NTV Telugu Site icon

Ola S1 E-Scooter: మార్కెట్‌లోకి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. ఫీచర్ల ఏంటి..? ధర ఎంతంటే..?

Ola S1 E Scooter

Ola S1 E Scooter

మార్కెట్‌లో ఎల‌క్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు రకాల ఈవీ బైక్‌లో హల్‌ చల్‌ చేస్తుండగా.. ఇప్పుడు ఓలా త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్‌1ను అధికారికంగా లంచ్‌ చేసింది.. ఓలా ఎస్‌1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాట‌రీ ప్యాక్‌తో ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ రూ. 99,999కి అందుబాటులో ఉండనుంది.. ఓలా భారతదేశంలో ఈవీ మార్కెట్‌లో స్కూటర్‌ను తేనున్నట్టు గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించింది.. ఏడాది తర్వాత ఎస్‌ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వెర్షన్, ధరను ప్రకటించారు. ఇది ‘ప్రో’ పేరును తొలగిస్తుంది, తక్కువ ధర ట్యాగ్‌ను కలిగి ఉంది మరియు ఇటీవల అప్‌డేట్ చేయబడిన Ather 450X మరియు రాబోయే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గట్టి పోటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఓలా ఎస్‌ 1 ఈ-స్కూటర్ గురించి మరిన్ని విషయాలు మీకోసం..

Read Also: Amitabh Choudhary: బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి హఠాన్మరణం

ఓలా ఎస్ 1.. ఎస్‌1 ప్రోతో సమానంగా కనిపిస్తుంది. ఆఫర్‌లో ఉన్న రంగు ఎంపికల సంఖ్య మాత్రమే ఇక్కడ తేడా ఉంటుంది… ఎస్‌ 1 ప్రోని 11 విభిన్న షేడ్స్‌ కలిగి ఉండగా, ఇది ఐదు రంగులలో మాత్రమే అందించబడుతుంది. గరిష్ట వేగం గంటకు 116 కిలోమీటర్ల నుంచి 95కి తగ్గించారు.. ఎస్‌ 1 ప్రో కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 60 వరకు పికప్‌ అందుకుంటే.. ఎస్‌1కు మాత్రం సుమారు 3.8 సెకన్లు పడుతుంది. కొత్త ఎస్‌1.. 3 kWh యొక్క చిన్న బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఎస్‌ 1 ప్రోలో మనం చూసే దానికంటే 25 శాతం చిన్నది. ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎస్‌ 1.. 4 కిలోల వరకు తేలికగా ఉంటుంది.

ఎస్‌ 1 ఈ-స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుందని మరియు ARAI ధృవీకరణ ప్రకారం 141 కిమీ పరిధిని అందజేస్తుందని ఓలా తెలిపింది. ఇది ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ రైడింగ్ మోడ్‌లతో ఉంటుంది. ‘హైపర్’ మోడ్ రూ. 40,000 ప్రీమియం కలిగిన ఎస్‌ 1 ప్రో కోసం మాత్రమే రిజర్వ్ చేయబడింది. ఆసక్తి ఉన్నవారు ఓలా ఎస్‌ 1 ఈ-స్కూటర్‌ను కేవలం రూ. 4999 మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.. కంపెనీ వెబ్‌సైట్‌ లేదా సాధారణ ఓలా యాప్‌లో కూడా బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముందస్తు యాక్సెస్‌ను పొందే కస్టమర్లు సెప్టెంబర్ 1న చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.. ఇతరులకు పూర్తి చెల్లింపు విండో సెప్టెంబర్ 2 నుండి తెరవబడుతుంది. వచ్చే నెలలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది..

Show comments