6.77 అంగుళాల FHD+ Super AMOLED స్క్రీన్, 50MP కెమెరా, IP54 రేటింగ్ తో Nothing Phone 3a Lite లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone 3a Lite: నథింగ్ (Nothing) సంస్థ 3 సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌గా “నథింగ్ ఫోన్ (3a) లైట్”ను అధికారికంగా విడుదల చేసింది. యూరప్, యూకేలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్, త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ ఫోన్‌ను బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 Pro (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 120fps గేమింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. 8GB LPDDR4X ర్యామ్, అదనంగా 8GB వరకు వర్చువల్ ర్యామ్ తోపాటు.. 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రోSD స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.
55dB ANC, 45 గంటల బ్యాటరీ లైఫ్, ప్రీమియం ఆడియో అనుభవంతో OPPO Enco X3s లాంచ్..!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
డిస్‌ప్లే పరంగా ఇందులో 6.77 అంగుళాల FHD+ 120Hz Super AMOLED స్క్రీన్ ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. 2160Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీ, పాండా గ్లాస్ రక్షణ, IP54 రేటింగ్ ఈ ఫోన్‌కు మన్నికను ఇస్తాయి. ఇక కెమెరా విభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ (Samsung), 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్‌లతో అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవం అందిస్తుంది. అలాగే ఫ్రంట్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K 30fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 5000mAh కాగా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే ప్యాకేజింగ్‌లో ఛార్జర్ ఇవ్వక పోవడం గమనార్హం.
IP66+IP68+IP69 రేటింగ్స్, 50MP ట్రిపుల్ కెమెరా, 7025mAh బ్యాటరీతో OPPO Find X9 లాంచ్..!
ఇక సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఈ ఫోన్ Android 15 ఆధారిత Nothing OS 3.5 తో పనిచేస్తుంది. 3 ప్రధాన OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌ల హామీ ఉంది. అంతేకాకుండా ఇందులో “Essential Space” అనే AI ఆధారిత ఫీచర్ ఉంది. ఇది నోట్స్ రాయడానికి, ఆలోచనలను రికార్డ్ చేయడానికి, కంటెంట్‌ను త్వరగా క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ధర విషయానికి వస్తే నథింగ్ ఫోన్ (3a) లైట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB + 128GB మోడల్ ధర 249 యూరోలు (రూ.25,560) కాగా, 8GB + 256GB మోడల్ ధర 279 యూరోలు (రూ.28,640)గా ఉంది. ఇది తెలుపు, నలుపు ఆప్షన్లలో లభిస్తుంది.
If your phone doesn’t light up your life, why? Presenting, Phone (3a) Lite. pic.twitter.com/XfxQb9vaDk
— Nothing (@nothing) October 29, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?