రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. కొత్త కొత్త స్మార్టఫోన్ కంపెనీలు రంగంలోకి దిగి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే విదేశీ కంపెనీ మొబైల్స్ అమ్మకాల్లో భారత్‌లో ఓ ఊపు ఊపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొ కొత్త స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారత విపణిలోకి అడుగుపెట్టబోతోంది. లండన్‌కు చెందిన ‘నథింగ్’ కంపెనీ తన తొలి మొబైల్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై నేతృత్వంలోని నథింగ్ లండన్‌లో వర్చువల్ ఈవెంట్ ద్వారా తన జర్నీని స్టార్ చేయనుంది. ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ‘రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్’ అనే వర్చువల్ ఈవెంట్‌తో నథింగ్ ఫోన్ 1 లాంచింగ్ జూలై 12న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామంటూ కంపెనీ మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అయితే ధర, ఫీచర్లపై అధికారింగా ధృవీకరణ లేనప్పటికీ ఊహాగానాలు ఇలా ఉన్నాయి.
