Site icon NTV Telugu

360° స్పేషల్ ఆడియో, బోస్ సౌండ్ టెక్నాలజీతో ప్రీమియం ఆడియో అనుభవం.. Noise Master Buds 2 లాంచ్.!

Noise Master Buds 2

Noise Master Buds 2

Noise Master Buds 2: భారతీయ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise) తన మాస్టర్ సిరీస్‌లో భాగంగా కొత్తగా నాయిస్ మాస్టర్ బడ్స్ 2ను భారత మార్కెట్లో తీసుకవస్తుంది. ఈ ఇయర్‌ బడ్స్‌ ను ముందుగా CES 2026 లో ప్రదర్శించగా.. ఇప్పుడు అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించింది. ఇవి గతంలో వచ్చిన మాస్టర్ బడ్స్‌కు సక్సెసర్‌గా వస్తున్నాయి.

నాయిస్ మాస్టర్ బడ్స్ 2లో “Sound by Bose” టెక్నాలజీని అందించారు. దీని వల్ల మంచి బాస్, స్పష్టమైన మిడ్స్, క్లియర్ హైస్‌తో సమతుల్యమైన ఆడియో అవుట్‌పుట్ లభిస్తుంది. మ్యూజిక్ వినడం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ వంటి వినియోగాలకు ఇవి అనుకూలంగా రూపొందించబడ్డాయి. ఈ డివైస్‌లో రీడిజైన్ చేసిన ఇంటర్నల్ క్యావిటీ స్ట్రక్చర్‌తో కూడిన అప్‌డేటెడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సిస్టమ్ అందించారు. ఇది బయటి శబ్దాన్ని సమర్థంగా తగ్గిస్తూ, అన్ని వాతావరణాల్లోనూ స్పష్టమైన సౌండ్‌ను అందిస్తుంది.

Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు మూడినట్లే..

Noise Master Buds 2 ప్రధాన ఫీచర్లు:
* 360° స్పేషల్ ఆడియోతో ఇంటెలిజెంట్ హెడ్ ట్రాకింగ్.
* 6 మైక్రోఫోన్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సిస్టమ్.
* సౌండ్+ అల్గారిథమ్ ఆధారిత క్లియర్ కాల్ సపోర్ట్.
* “నాయిస్ ఆడియో” యాప్ ద్వారా AI వాయిస్ చాట్ అసిస్టెంట్.
* 6-యాక్సిస్ IMU సెన్సార్‌తో హెడ్ జెష్చర్ కంట్రోల్స్.

ఇవి మెటాలిక్ ఫినిష్, బ్రష్డ్ మెటల్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటాయి. లైట్‌ వెయిట్, ఎర్గోనామిక్ డిజైన్ వల్ల ఇవి ఎక్కువసేపు ధరించినా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో IPX5 వాటర్ రెసిస్టెన్స్, ఆడియో & కనెక్టివిటీ విషయంలో 10 మి.మీ డ్రైవర్, బ్లూటూత్ v6.1, 10 మీటర్ల రేంజ్, డ్యుయల్ డివైస్ పెయిరింగ్ సపోర్ట్, 30 గంటల వరకు ప్లేటైమ్, 10 నిమిషాల చార్జ్‌తో 6 గంటల వినియోగం ఉన్నాయి. ఇంకా ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, టచ్ కంట్రోల్స్, ఈక్వలైజర్ సపోర్ట్, ఫైండ్ మై డివైస్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ లభిస్తాయి.

Ravichandran Ashwin: “యువరాజ్ కంటే అభిషేక్ బెటర్”.. పాకిస్థాన్ మాజీ పేసర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన అశ్విన్..

నాయిస్ మాస్టర్ బడ్స్ 2 మార్చి 19న మధ్యాహ్నం 12 గంటలకు కార్బన్, ఔరమ్, మెర్క్యురీ కలర్ ఆప్షన్లలో లాంచ్ కానున్నాయి. వినియోగదారులు రూ. 999 చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ ఆఫర్లలో భాగంగా రూ. 1,999 ఇన్‌స్టంట్ కూపన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులతో అదనంగా రూ. 600 డిస్కౌంట్ అన్ని ఆఫర్లు వర్తించిన తరువాత ధర రూ. 6,399 గా ఉంటుంది. డెలివరీ అనంతరం కూడా కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. ఇవి gonoise.com, ఇతర రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటాయి.

Exit mobile version