Netflix: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త ఫీచర్ ను తీసుక వచ్చింది. ఇప్పటివరకు “థంబ్స్ అప్ లేదా థంబ్స్ డౌన్” వంటి రేటింగ్ విధానాలతో ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించిన నెట్‌ఫ్లిక్స్.. ఇప్పుడు కొత్తగా రియల్ టైమ్ ఓటింగ్ అనే కొత్త ఇంటరాక్టివ్ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ద్వారా లైవ్ ప్రసారాల సమయంలోనే ప్రేక్షకులు ప్రత్యక్షంగా పాల్గొని షో ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
ఈ ఫీచర్‌ను నెట్‌ఫ్లిక్స్ నేడు (జనవరి 21) అధికారికంగా లాంచ్ చేసింది. ‘స్టార్ సెర్చ్’ అనే లైవ్ షో ప్రీమియర్ సందర్భంగా ఈ రియల్‌టైమ్ ఓటింగ్‌ను తొలిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం అమెరికా కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటలకు (PT), భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రసారమైంది. లైవ్ షో జరుగుతున్న సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ప్రకారం, ఈ రియల్‌టైమ్ ఓటింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా లైవ్ ఈవెంట్ల కోసం రూపొందించారు. ప్రేక్షకులు వేసే ఓట్లు నేరుగా షోలో జరిగే పరిణామాలపై, పోటీదారుల ఎంపికపై ప్రభావం చూపుతాయి. అంటే ఇకపై కొన్ని లైవ్ షోల్లో కథనం లేదా ఫలితాలు ప్రేక్షకుల నిర్ణయాలపై ఆధారపడి ఉండనున్నాయి. అయితే ఈ ఫీచర్ వినియోగానికి కొన్ని సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం ఇది టీవీ యాప్స్, ఇతర స్ట్రీమింగ్ డివైసులలో అందుబాటులో ఉండగా, అక్కడ వినియోగదారులు తమ రిమోట్ కంట్రోల్ ద్వారా సులభంగా ఓటు వేయవచ్చు. అలాగే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్న వారు స్క్రీన్‌పై ట్యాప్ చేయడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అయితే వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ రియల్‌టైమ్ ఓటింగ్ ఫీచర్‌ను ఉపయోగించే అవకాశం ప్రస్తుతం లేదు. అందువల్ల సపోర్ట్ చేసే డివైసుల ద్వారానే ఓటింగ్‌లో పాల్గొనాలని నెట్‌ఫ్లిక్స్ సూచిస్తోంది.
CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
ఈ ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందు నెట్‌ఫ్లిక్స్ ‘డిన్నర్ టైమ్ లైవ్ విత్ డేవిడ్ చాంగ్’ షోలో పరీక్షించింది. ఆ సమయంలో యూజర్లు ఈ ఇంటర్‌ఫేస్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో విశ్లేషించింది. ఓటింగ్ విధానంలో ప్రతి ప్రొఫైల్‌కు ఒకే ఓటు అవకాశం ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ‘స్టార్ సెర్చ్’ ఈ రియల్‌టైమ్ ఓటింగ్‌ను ఉపయోగించిన తొలి షో మాత్రమేనని, భవిష్యత్‌లో మరిన్ని లైవ్ ఈవెంట్లలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో స్ట్రీమింగ్ ప్రపంచంలో ప్రేక్షకుల పాత్ర మరింత కీలకంగా మారనుంది.
