NTV Telugu Site icon

Artemis 1: చరిత్ర సృష్టించిన నాసా.. భూమి నుంచి 4 లక్షల కి.మీ దూరంలో ఆర్టెమిస్ నౌక

Artemis1

Artemis1

NASA’s Artemis 1, Over 400,000 Kms From Earth, Sets A New Record: నాసా చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్ 1 వ్యోమనౌక విజయవంతంగా దాని యాత్రను కొనసాగిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ అంతరిక్ష నౌక ప్రయోగం ఇటీవల జరిగింది. ఈ నౌక ద్వారా నాసా చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆర్టెమిస్. గతంలో నాసాకు చెందిన అపోలో 13 మిషన్ 4,00,171 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు ఆర్టెమిస్1 4,19,378 కిలోమీటర్లు ప్రయాణించి అపోలో 13 రికార్డును తిరగరాసింది. మరో ఆరు రోజుల పాటు ఈ వ్యోమనౌక చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తుంది.

Read Also: PM Narendra Modi: “టెర్రరిజం” కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

డిసెంబర్ 11 ఆదివారం రోజున ఆర్టెమిస్ భూమిపైకి తిరిగి రానుంది. భూమిపైకి వచ్చేందుకు ఆర్టెమిస్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది. మానవసహిత చంద్రుడి యాత్రలు జరిపేందుకు మళ్లీ నాసా సిద్ధం అయింది. దీని కోసమే ఆర్టిమిస్1 ప్రయోగాన్ని జరిపింది. అపోలో మిషన్స్ తరువాత నాసా చంద్రుడిపైకి మానవ సహిత యాత్రలను చేపట్టలేదు నాసా. ఆ తరువాత ఇప్పుడే మళ్లీ ఆర్టెమిస్ ద్వారా మానవసహిత యాత్రను చేపట్టాలని భావిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువం గురించిన మరింత విషయాలు తెలుసుకోవడానికి ఆర్టెమిస్ ప్రయోగం సహకరిస్తుందని నాసా భావిస్తోంది. చంద్రుడి ఉపరితలాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సహకరించనుంది.

చివరి సారిగా 1972లో వ్యోమగాములతో అపోలో-17 మిషన్ మూన్ మిషన్ ని నాసా చేపట్టింది. ఆ తరువాత 2025లో వ్యోమగాములతో కూడిన మూన్ ల్యాండింగ్ మిషన్ ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. ఈ ప్రయోగంలో ఓ మహిళ ఆస్ట్రోనాట్ కూడా ఉండనున్నట్లు నాసా వెల్లడించింది. ఇదే జరిగితే చంద్రుడిపై కాలుపెట్టిన తొలి మహిళగా రికార్డుకెక్కే అవకాశం ఉంటుంది. ఆర్టిమిస్-1 మానవ చంద్రుడి అంతరిక్ష యాత్రకు పునాది వేస్తుందని నాసా భావిస్తోంది.