NTV Telugu Site icon

Mars: అంగారక గ్రహంపై ‘కుక్క’ ? ఎక్కడి నుంచి వచ్చింది?

Mars

Mars

అంగారకుడి ఉత్తర ధ్రువంలో అనేక రహస్యమైన ఆకారాలు కనిపించాయి. ఈ ఆకారాలు మార్స్ ఉపరితలం క్రింద ఉన్నాయి. వీటిలో ఒకటి కుక్కలా కనిపించే ఆకారం ఆశ్చర్యానికి గురి చేసింది. కుక్కను పోలిన ఆకారాన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి.. శాస్త్రవేత్తలు మార్స్ యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం యొక్క మ్యాప్‌ను తయారు చేస్తున్నారు. అప్పుడు వారికి ఉత్తర ధ్రువంలో చాలా రహస్యమైన, దట్టమైన ఆకారాలు కనిపించాయి. ఈ ఆకారాలు చాలా ఎక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉండటాన్ని గుర్తించారు. అంటే.. దానిని క్లాట్ లేదా ఏదైనా చాలా దట్టమైన ప్రాంతం అయి ఉంటుందని వారు పేర్కొన్నారు.

READ MORE: AP CM Chandrababu: తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి సీఎం చంద్రబాబు

శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ మ్యాప్.. అగ్నిపర్వతాల చరిత్ర, మార్స్‌ లోని ఎత్తైన పర్వతం ఒలింపస్ మోన్స్ రహస్యాలను కూడా వెల్లడించింది. ఈ మ్యాప్‌లో మార్స్ గురుత్వాకర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. నాసా ఇన్‌సైట్ ల్యాండర్, మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ రికార్డుల నుంచి ఈ మ్యాప్ తయారు చేశారు. ఇవి మార్స్ లో దాగి ఉన్న గురుత్వాకర్షణలో మార్పులను వెల్లడిస్తాయి.

READ MORE: Koratala Siva: ‘దేవర’ అసలు ధీమ్ ఏంటంటే: కొరటాల శివ ఇంటర్వ్యూ

మ్యాప్ తయారు చేస్తున్నప్పుడు ఏం చూశారు?

ఈ కొత్త మ్యాప్‌లో, అంగారకుడి ఉత్తర ధ్రువంలో 20 భూగర్భంపై బొబ్బలు(బొడిపెలు వంటి ఆకారాలు) కనిపించాయి. ఇవి బోరియాలిస్ బేసిన్‌లో ఉన్నాయి. అక్కడ 300 కోట్ల సంవత్సరాల నాటి సముద్రగర్భం ఉంది. ఇది ఇప్పుడు ఎండిపోయింది. అదే ప్రదేశంలో ఈ బొబ్బలు వివిధ ఆకారాలు, పరిమాణాలలో ఉన్నాయి. అందులో ఒకటి కుక్కలా కనిపిస్తుంది. వాటి సాంద్రత క్యూబిక్ మీటరుకు 300 నుంచి 400 కిలోగ్రాముల కంటే ఎక్కువ. నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్లానెటరీ శాస్త్రవేత్త, ఈ అధ్యయనానికి ప్రధాన పరిశోధకుడు బార్ట్ రూట్ మాట్లాడుతూ.. అగ్నిపర్వత పేలినప్పుడు ఈ మర్మమైన ఆకృతులు ఏర్పడి ఉండవచ్చన్నారు. లేదా అది ఒక పురాతన ఉల్క ఢీకొనడం ద్వారా సృష్టించబడిన శక్తి ద్రవ్యరాశి కావచ్చన్నారు. ఇది అధిక గురుత్వాకర్షణ సమూహమని అంచనా వేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, సంకేతాలు ఉపరితలంపై కనిపించవని ఆయన స్పష్టం చేశారు.