Motorola Signature 27: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా నెక్స్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా సిగ్నేచర్ 27 (Motorola Signature 27)ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రదర్శించింది. అత్యాధునిక ప్రాసెసర్, శక్తివంతమైన కెమెరాలు, ప్రీమియం ఆడియో ఫీచర్లు, దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్‌ను అందించారు. ఈ ప్రాసెసర్‌కు తోడుగా ఆర్కిటిక్మెష్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీ, సిగ్నల్ రిసెప్షన్ కోసం సిక్స్ యాంటెన్నా సెటప్‌ను అందిస్తున్నారు. దీంతో హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, అధిక పనితీరు అవసరమయ్యే పనులను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
కెమెరాల విషయంలో మోటరోలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఫోన్లో 50MP సోనీ లైటియా 910 మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించారు. ఫోటోలు, జూమ్ షాట్లు మరింత స్పష్టంగా రావడానికి 3.5 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, క్వాల్కామ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీలను ఉపయోగించారు. వీడియోల నాణ్యతను మెరుగుపరిచేందుకు మోటరోలా వీడియో ఎన్హాన్స్మెంట్ ఇంజిన్‌ను కూడా ఇందులో చేర్చారు.
ఆడియో విభాగంలోనూ ఈ ఫోన్ ప్రత్యేకతను సంతరించుకుంది. బాంగ్ అండ్ ఒలుఫ్సెన్ భాగస్వామ్యంతో రూపొందిన ఆడియో టెక్నాలజీని కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా మోటరోలా సిగ్నేచర్ 27 నిలవనుంది. దీని ద్వారా సంగీతం వినడం, గేమింగ్, వీడియోలు చూడటం వంటి సందర్భాల్లో మెరుగైన ఆడియో అనుభూతిని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గూగుల్ జెమినీ AI అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులకు దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ మద్దతును అందించేందుకు ఏడేళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని మోటరోలా ప్రకటించింది.
ఈ మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్ పాంటోన్ కోల్ స్మోక్, పాంటోన్ కాపులెట్ ఆలివ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. 2026 అక్టోబర్ 9న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. అయితే ఫోన్ ధర, పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లు, అమ్మకాలు ప్రారంభమయ్యే తేదీని ఇంకా వెల్లడించలేదు. మరికొద్ది రోజుల్లో మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు మోటరోలా తెలిపింది.
Revealing our most advanced smartphone yet at #SnapdragonSummit, motorola signature 27. Here’s what to look forward to:
– Our best camera system yet.
– The only smartphone in the market to feature audio by Bang & Olufsen.
– Unprecedented speeds with @Snapdragon 8 Elite Extreme Gen 6 mobile processor, breakthrough AI, premium craftsmanship, and more.#SignatureStatement #MotorolaSignature
Learn more: https://t.co/TubDHWcSli
— motorola (@Moto) September 22, 2026

