NTV Telugu Site icon

Motorola Razr 60 Ultra: సూపర్ ఫీచర్లతో మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో మార్కెట్ లోకి

Moto

Moto

స్మార్ట్ ఫోన్ లవర్స్ ఫోల్డబుల్ ఫోన్ల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంపెనీలు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఫోల్డబుల్ ఫోన్‌ల శ్రేణిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. Motorola Razr+ (2025) / Razr 60 Ultra కొంతకాలం నుంచి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. మోటరోలా తన తదుపరి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ – మోటరోలా రేజర్ 60 అల్ట్రాపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీని గురించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ, నివేదికల ప్రకారం త్వరలోనే మార్కెట్ లోకి రిలీజ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read:Bride Flees With Boyfriend: బ్యూటీపార్లర్ వెళ్తానని ప్రియుడితో వధువు జంప్.. కిడ్నాప్‌ అని భర్త ఫిర్యాదు..

రాబోయే Razr 60 గురించి వివరాలు వెల్లడికానప్పటికి, ఈ ఫోన్ 33W ఛార్జింగ్ అడాప్టర్‌తో రానున్నట్లు తెలుస్తోంది. Razr 60 Ultra వెనుక భాగంలో ఫాక్స్ లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. Razr 50 Ultra లాగానే, కవర్ డిస్ప్లే కూడా పెద్దదిగా ఉంటుంది. డ్యూయల్-కెమెరా సెటప్ కూడా ఉంది. కవర్ డిస్ప్లే 4-అంగుళాలు ఉంటుందని భావిస్తున్నారు. 6.9 ఇంచ్ LTPO pOLED ఫోల్డబుల్ ప్రధాన డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. యూజర్లు వీడియోలను చూడటానికి, గేమ్‌లు ఆడటానికి, జెమిని AIని ఉపయోగించడానికి, నోటిఫికేషన్‌లను చెక్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.

Also Read:CM Revanth Reddy : రాజశేఖర్‌ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్‌ కాదా..?

Razr 60 Ultra ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఎలైట్ చిప్‌సెట్, 12GB RAM, 256GB స్టోరేజ్ తో Android 15 ఆధారంగా హలో UIతో లాంచ్ అవుతుందని గీక్‌బెంచ్ నివేదిక వెల్లడించింది. 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ (2x ఆప్టికల్ జూమ్) మరియు 32MP సెల్ఫీ కెమెరాతో రానుంది. Moto Razr 60 Ultra ధర గతంలో ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఫోన్ల మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 2025లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.