144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr 2027 Specifications: మోటరోలా (Motorola) నుంచి మరో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. Motorola Razr 2027కు సంబంధించిన ప్రెస్ ఇమేజ్‌లు, స్పెసిఫికేషన్లు తాజాగా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ గత మోడల్‌తో పోలిస్తే పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు లీక్స్ సూచిస్తున్నాయి. ఇందులో 6.96 అంగుళాల FlexView FHD+ ఫోల్డబుల్ డిస్ప్లే ఉండనుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక బయటవైపు 4 అంగుళాల QuickView pOLED డిస్ప్లేను అందించనున్నారు. గత మోడల్లోని 3.63 అంగుళాల 90Hz కవర్ స్క్రీన్‌తో పోలిస్తే ఇది పెద్ద అప్‌గ్రేడ్. కొత్త ఔటర్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది.
ఈ ఫోన్లో 4nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 7550X ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్ అందించనున్నారు. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరాను OIS సపోర్ట్‌తో అందించనున్నారు. దీనికి జతగా మరో 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండనుంది. ఈ కెమెరాలతో 4K రిజల్యూషన్‌లో 30fps వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరాను అందించనున్నారు.
Also Read
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
- 200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
- 6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
బ్యాటరీ విభాగంలోనూ మోటరోలా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో 5,000mAh బ్యాటరీని అందించనున్నట్లు లీకైన సమాచారం వెల్లడించింది. ఇది 45W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W Qi వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్, USB Type-C పోర్ట్ ఉండనున్నాయి. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS, NFC ఫీచర్లు ఉండనున్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించనున్నారు. అంతేకాకుండా IPX8, IPX9, IP4X రేటింగ్స్‌తో నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించనున్నట్లు సమాచారం.
డిజైన్ విషయానికి వస్తే.. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 171mm పొడవు, 74mm వెడల్పు, 7.3mm మందం ఉండనుంది. ఫోల్డ్ చేసినప్పుడు 88mm పొడవు, 14.6mm మందంతో ఉంటుంది. దీని బరువు 195 గ్రాములుగా ఉండనుంది. లాంచ్ విషయానికి వస్తే.. Motorola Razr 2027ను ఏప్రిల్ లేదా మే నెలల్లో విడుదల చేసే సంప్రదాయానికి ముందుగానే పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి లీకుల ఆధారంగా వచ్చినవే. కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
-
Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
-
US Tariff Threat: భారత్‌పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!