Site icon NTV Telugu

Motorola: 200MP కెమెరా ఫోన్ లాంచ్‌కు రంగం సిద్ధం

Motorola 200mp Phone

Motorola 200mp Phone

మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అధునాతన ఫీచర్లతో వచ్చే ప్రతీ మోడల్ విక్రయాలు కూడా రికార్డ్ స్థాయిలో జరిగిపోతున్నాయి. అందుకే.. కంపెనీలన్నీ పోటీపడి మరీ వినియోగదారుల్ని ఆకర్షించేందుకు రకరకాల మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. లెక్కలేనన్ని ఫీచర్లతో ఒకదానికి మించి మరొక మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మోటోరోలా కంపెనీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.

ఈ డివైజ్ పేరుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న మోటోరోలా ఫ్రాంటియర్ ఫోన్ ఇదే కావొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ టీజర్‌ను షేర్ చేసిన ఆ కంపెనీ.. డివైజ్ లాంచింగ్ వివరాలను కూడా వెల్లడించింది. జులైలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. 200MP కెమెరాతో ఓ ఫోన్‌ను మోటోరోలా కంపెనీ తయారు చేయడం ఇదే మొదటిసారి. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ సెన్సార్ స్పెషల్ అట్రాక్షన్. దీంతోపాటు మరో రెండు రియర్ లెన్స్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి అల్ట్రా-వైడ్ యూనిట్ కావచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్, మోటొరోలా బ్రాండింగ్‌ లోగో కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 60MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 30fps వద్ద 8K వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ డివైజ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పంచ్-హోల్ పోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని సమాచారం. కొత్తగా లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 చిప్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. 8GB/12GB RAM, 128GB/256GB వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Exit mobile version