Motorola: 200MP కెమెరా ఫోన్ లాంచ్‌కు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అధునాతన ఫీచర్లతో వచ్చే ప్రతీ మోడల్ విక్రయాలు కూడా రికార్డ్ స్థాయిలో జరిగిపోతున్నాయి. అందుకే.. కంపెనీలన్నీ పోటీపడి మరీ వినియోగదారుల్ని ఆకర్షించేందుకు రకరకాల మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. లెక్కలేనన్ని ఫీచర్లతో ఒకదానికి మించి మరొక మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మోటోరోలా కంపెనీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
ఈ డివైజ్ పేరుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న మోటోరోలా ఫ్రాంటియర్ ఫోన్ ఇదే కావొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ టీజర్‌ను షేర్ చేసిన ఆ కంపెనీ.. డివైజ్ లాంచింగ్ వివరాలను కూడా వెల్లడించింది. జులైలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. 200MP కెమెరాతో ఓ ఫోన్‌ను మోటోరోలా కంపెనీ తయారు చేయడం ఇదే మొదటిసారి. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ సెన్సార్ స్పెషల్ అట్రాక్షన్. దీంతోపాటు మరో రెండు రియర్ లెన్స్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి అల్ట్రా-వైడ్ యూనిట్ కావచ్చు.
Also Read
- Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
- Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
ఈ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్, మోటొరోలా బ్రాండింగ్ లోగో కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 60MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 30fps వద్ద 8K వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ డివైజ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పంచ్-హోల్ పోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని సమాచారం. కొత్తగా లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 చిప్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. 8GB/12GB RAM, 128GB/256GB వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!