Motorola G14: అదిరిపోయే ఫీచర్స్ మరో ఫోన్ ను లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కంపెనీ మోటోరోలా మార్కెట్ లోకి మరో చవకైనా ధర ఫోన్ మోటోరోలా 14 ను మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.. మోటో జీ14 పేరుతో ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే ఆగస్టు1 మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రెడ్ మీ 12 పేరుతో దీనిని తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఇప్పటికే ప్రకటించింది. అయితే మోటోరోలా జీ14 4జీ ఫోన్ కాగా.. రెడ్ మీ 12 మాత్రం 5జీ సపోర్టుతో వస్తోంది. అయితే మోటోరోలాలో మాత్రం వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరాలు, 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ట్-ఎనేబుల్డ్ స్టీరియో స్పీకర్‌లతో సహా కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లతో ఫోన్ ప్యాక్ చేసింది. రెడ్ మీ కూడా మోటో జీ14కి పోటీగా 4జీ వేరియంట్ ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ రోజు లాంచ్ అవుతున్న మోటోరోలా జీ14కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మోటో జీ14 ఫీచర్స్..
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
నలుపు, నీలం రంగులలో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది..ఫోన్ కుడి వైపున వాల్యూమ్, పవర్ బటన్‌ను గమనించవచ్చు. దీనిలో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ స్పీకర్లు, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది యునిసోక్ టి616 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. దీనిని ఆండ్రాయిడ్ 14కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.. ఇక కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో మాక్రో కెమెరా ఉంటాయి. ఫోన్ 20W ఛార్జింగ్ సపోర్టుతో కూడిన 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో 94 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 34 గంటల టాక్ బ్యాక్ టైమ్‌ను అందిస్తుందని మోటోరోలా పేర్కొంది..
ధర విషయానికొస్తే.. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ల ఆధారంగా, భారతదేశంలో ఫోన్ ధర రూ. 15,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఈరోజు లాంచ్ కానున్న ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!