Site icon NTV Telugu

స్టైల్ + టెక్ కాంబో.. మోటరోలా సంచలనం.. moto Sound Flow, moto Watch, moto Pen Ultra, moto Tag 2లు లాంచ్..!

Motorola

Motorola

Motorola: మోటరోలా (Motorola) కొత్తగా మోటో థింగ్స్ ఎకోసిస్టం (moto things ecosystem)ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కనెక్టివిటీ, ఫంక్షనాలిటీ, డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త డివైస్‌లను పరిచయం చేసింది. CES 2026 వేదికగా మోటరోలా మోటో సౌండ్ ఫ్లో (moto Sound Flow), మోటో వాచ్ (moto Watch), మోటో పెన్ అల్ట్రా (moto Pen Ultra), మోటో ట్యాగ్ 2 (moto Tag 2) గాడ్జెట్లు స్టైల్‌తో పాటు స్మార్ట్ ఫీచర్లతో విడుదల చేసింది. వీటిని ప్రత్యేకంగా పాంటోన్-క్యూరేటెడ్ రంగులు, ప్రీమియం ఫినిష్‌లు ఈ డివైస్‌లకు హైలైట్‌గా నిలుస్తున్నాయి.

మోటో సౌండ్ ఫ్లో (moto Sound Flow):
మోటరోలా నుంచి వచ్చిన తొలి పోర్టబుల్ స్పీకర్ ఇదే. సౌండ్ బై బోస్ (Sound by Bose) ఆడియో టెక్నాలజీతో రూపొందిన ఈ స్పీకర్‌లో వూఫర్, ట్వీటర్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్లతో 30W పవర్‌ఫుల్ అవుట్‌పుట్ లభిస్తుంది. Wi-Fi, బ్లూటూత్ 5, UWB సపోర్ట్‌తో డివైస్‌ల మధ్య ఆడియోను సులభంగా స్విచ్ చేసుకోవచ్చు. డైనమిక్ స్టీరియో, క్విక్ స్విచ్, రూమ్ షిఫ్ట్ వంటి ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 6000mAh బ్యాటరీ, IP67 రేటింగ్ ఉండటం వల్ల ఇండోర్, అవుట్‌డోర్ వినియోగానికి అనువుగా ఉంటుంది.

IP69 రేటింగ్, 7000mAh బ్యాటరీ, హైఎండ్ స్పెసిఫికేషన్లు.. మిడ్‌రేంజ్ ధరతో OPPO Reno 15c లాంచ్..!

మోటో వాచ్ (moto Watch):
క్లాసిక్ డిజైన్‌తో పాటు హెల్త్ & ఫిట్‌నెస్ ట్రాకింగ్‌పై ఫోకస్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌లో ‘పోలార్’ (Polar) భాగస్వామ్యంతో స్టెప్స్, నిద్ర, హార్ట్‌రేట్, స్ట్రెస్, బ్లడ్ ఆక్సిజన్ వంటి డేటా ట్రాక్ చేయొచ్చు. 13 రోజుల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, IP68 వాటర్ రెసిస్టెన్స్, Gorilla Glass 3 ప్రొటెక్షన్‌తో పాటు కాల్స్‌కు మైక్, స్పీకర్ సపోర్ట్ కూడా ఉంది. మోటో AI ఫీచర్లు దీనిని మరింత స్మార్ట్‌గా మారుస్తున్నాయి.

మోటో పెన్ అల్ట్రా (moto Pen Ultra):
క్రియేటర్లు, ప్రొడక్టివిటీ యూజర్ల కోసం రూపొందిన ఈ స్టైలస్ మోటోరోలా సిగ్నేచర్, రేజర్ ఫోల్డబుల్ డివైస్‌లకు అనుకూలంగా పనిచేస్తుంది. ప్రెషర్ సెన్సిటివ్ టిప్, పామ్ రిజెక్షన్, టిల్ట్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో నోట్స్, డ్రాయింగ్, అనోటేషన్స్ సులభం. స్కెచ్ టూ ఇమేజ్, సర్కిల్ టూ సెర్చ్, క్విక్ క్లిప్ వంటి AI టూల్స్ ఈ పెన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తున్నాయి.

AI showdown: AI సామ్రాజ్యంలో సింహాసనం ఎవరిది.? ChatGptకి గట్టి పోటీ ఇస్తున్న Gemini..!

మోటో ట్యాగ్ 2 (moto Tag 2):
విలువైన వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడే ఈ స్మార్ట్ ట్యాగ్‌లో UWB, బ్లూటూత్ ఛానల్ సౌండింగ్ టెక్నాలజీ ఉంది. ఇందులో 500+ రోజుల బ్యాటరీ లైఫ్, IP68 రేటింగ్, గూగుల్ ఫైండ్ హబ్ ఇంటిగ్రేషన్‌తో ట్రావెల్, డైలీ యూజ్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

 

ధరలు:

మోటో సౌండ్ ఫ్లో: €199 (రూ. 20,900)

మోటో వాచ్: €99 నుంచి ప్రారంభం

మోటో పెన్ అల్ట్రా: €299 (రూ. 31,400)

మోటో ట్యాగ్ 2: €39 (రూ. 4,100)

ఈ కొత్త మోటో థింగ్స్ డివైస్‌లు త్వరలో యూరప్, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా సహా పలు మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version