NTV Telugu Site icon

Moto G42: ఇండియాలో మోటో జీ 42 లాంచ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే

Moto G42

Moto G42

మోటోరొలా నుంచి మోటో జీ 42 మొమైల్ సోమవారం ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మోటో జీ42 పోటీ ఇవ్వనుంది. గతేడాది యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయినా ఇండియాలో ఏడాది తరువాత లాంచ్ చేశారు. మోటో జీ42 20:9 ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ను కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీంతో పాటు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రెడిమి నోట్ 11, రియల్ మీ 9ఐ, పోకో ఎం4 ప్రో వంటి వాటితో మోటో జీ42 పోటీ పడనుంది

ధర విషయానికి వస్తే 4జీ రామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,999గా ఉంది. అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోస్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. జూలై 11 నుంచి ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో ఫోన్ లభించనుంది. మోటో జీ42 లాంచ్ ఆఫర్ కింద ఎస్బీఐ కార్డు వినియోగించే వారికి రూ. 1000 డిస్కౌంట్ ఇస్తోంది.

మోటో జీ42 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ద్వారా పనిచేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్(1,080×2,400 పిక్సెల్‌లు) అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ట్రిపుర్ రియర్ కెమెరాతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది. ఎఫ్/1.8 లెన్స్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, డెప్త్ షూటర్ తో పాటు 2- మెగా పిక్సెల్ షూటర్ ను కలిగి ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1 టీబీ మెమోరీ స్టోరేజిని సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్, ఎఫ్ఎం, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్, డ్యుమల్ స్పీకర్ డాల్బీ అట్మోస్ ను సపోర్టింగ్ ఫీచర్లు మోటో జీ 42లో ఉన్నాయి.