Site icon NTV Telugu

IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

Moto G Power (2026)

Moto G Power (2026)

Moto g Power (2026): మోటరోలా (Motorola) G సిరీస్‌లో భాగంగా moto g Power (2026) స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన moto g Power‌కు ఇది నెక్స్ట్ వర్షన్. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను అందించింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల బయట వెలుతురులోనూ క్లియర్‌గా కంటెంట్ చూడవచ్చు. డిస్‌ప్లేకు Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా ఉంది.

Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..

moto g Power ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. OISతో కూడిన 50MP ప్రధాన రియర్ కెమెరాను ఇచ్చారు. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్ ను కొనసాగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత My UXతో ఇది పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో పాటు.. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు మెమరీ విస్తరించుకునే అవకాశం ఉంది.

Moto g Power (2026)లో 5200mAh బ్యాటరీను అందించారు. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈసారి వైర్‌లెస్ ఛార్జింగ్‌ను తొలగించారు. ఆడియో పరంగా స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, అలాగే చాలామందికి ఉపయోగపడే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఇది MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, అలాగే IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అంటే నీటిలో మునిగినా, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. వెనుక భాగంలో సాఫ్ట్ వెగన్ లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఇది ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది.

IND vs SA 4th T20I: నేడే నాల్గవ టీ20.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా..?

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G SA/NSA, డ్యువల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB Type-C వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డ్యువల్ సిమ్ సపోర్ట్‌తో పాటు eSIM సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈవెనింగ్ బ్లూ, ప్యూర్ కాష్మేరె రంగుల్లో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. 299.99 అమెరికా డాలర్స్ (భారతీయ కరెన్సీలో రూ.27,290) కు లభిస్తుంది. జనవరి 8 నుంచి బెస్ట్ బయ్, అమెజాన్, మోటోరోలా.కామ్ లో లభిస్తాయి.

Exit mobile version