7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- Moto G Max ఆగస్టు 14, 2026న లాంచ్..
- డిస్ప్లే: 6.72 అంగుళాల FHD+ LCD, 120Hz
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 6s Gen 4
- కెమెరా: 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా
- బ్యాటరీ: 7,000mAh, ఆపరేటింగ్ సిస్టమ్: Android 16
- డ్యూరబిలిటీ: MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto G Max: మోటరోలా (Motorola) సంబంధించిన G-సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి మాక్స్ (Moto G Max)ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది.
120Hz FHD+ డిస్ప్లే:
ఈ సరికొత్త మొబైల్ లో 6.72 అంగుళాల FHD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, యానిమేషన్లు, గేమింగ్ సమయంలో డిస్ప్లే మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను అందించారు. ఫోన్ డిజైన్‌లో ‘లగ్జరీ శాటిన్ ఫినిష్’ ఉంటుంది. ఫాంటోనే ఆధారిత ” ఫాంటోనే స్టార్గాజెర్, ఫాంటోనే మాలగా, ఫాంటోనే అలస్కాన్ బ్లూ” అనే మూడు కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు దుమ్ము, నీటి నుంచి అధిక స్థాయి రక్షణను అందించేలా ఫోన్‌ను రూపొందించారు.
Also Read
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
50MP సోనీ కెమెరా & ప్రాసెసర్:
ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరాను అందించారు. మెరుగైన సెన్సార్ ఆప్టిక్స్, సాఫ్ట్వేర్ ట్యూనింగ్ ద్వారా పగటి సమయంలోనే కాకుండా తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫోటోలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. పనితీరు కోసం ఇందులో Qualcomm Snapdragon 6s Gen 4 SoC చిప్ సెట్ ను ఉపయోగించారు. దీనికి 6GB లేదా 8GB LPDDR5X RAM, 128GB UFS 3.1 స్టోరేజ్ జత చేశారు.
7,000mAh భారీ బ్యాటరీ:
ఈ ఫోన్లోని ప్రధానంగా చెప్పుకోవాలిసిన వాటిలో 7,000mAh భారీ బ్యాటరీ ఒకటి. సాధారణ వినియోగంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలదని మోటరోలా తెలిపింది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడే ఫీచర్‌గా చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ పరంగా ఇందులో ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. భవిష్యత్తులో 2 ఆండ్రాయిడ్ OS అప్గ్రేడ్లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది.
ఆడియో విషయానికి వస్తే స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, PC వంటి ఇతర డివైజ్‌ల మధ్య కంటెంట్‌ను సింక్ చేసుకోవడం, డిస్ప్లేను ఎక్స్టెండ్ చేసుకోవడం వంటి సదుపాయాలు లభిస్తాయి. లాంచ్ తర్వాత ఈ ఫోన్‌ను మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ధరను కంపెనీ లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!