NTV Telugu Site icon

Microsoft Windows 10: విండోస్ 10కి స్వస్తి పలకనున్న మైక్రోసాఫ్ట్.. 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం..

Windows 10

Windows 10

Windows 10: Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కి ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దీని ఫలితంగా దాదాపు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్‌ల (PCలు)పై ప్రభావం పడొచ్చు. ఇది ల్యాండ్ ఫిల్ వ్యర్థాలను పెంచే అవకాశం ఉందని కెనాలిస్ రీసెర్చ్ తెలిపింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయని అంచనా. అయితే ఓఎస్ సపోర్టు ముగిసినా కూడా చాలా కంప్యూటర్లు చాలా ఏళ్ల వరకు పనిచేస్తుండగా.. సెక్యూరిటీ అప్డేట్ లేని పరికరాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కెనాలిస్ హెచ్చరించింది. అయితే విండోస్ 10 పరికరాల కోసం అక్టోబర్ 2028 వరకు వార్షిక ధరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందించే ప్రణాళికను ప్రకటించింది. అయితే ఈ ధర ఎంత ఉంటుందనే వివరాలను వెల్లడించలేదు.

Read Also: Ivanka Trump: ఇజ్రాయిల్‌లో ట్రంప్ కూతురు.. అక్టోబర్ 7 బాధితులకు పరామర్శ..

ఒకవేళ విండోస్ 10 సపోర్ట్ సెక్యురిటీ అప్డేట్స్ కోసం ధరను ప్రతిపాదిస్తే.. గతంలో లాగే, కొత్త పీసీలకు మారడం ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది, స్ర్కాప్‌గా మారే పాత పీసీల సంఖ్యను పెంచుతుందని కెనాలిస్ అంచానా వేస్తోంది. అక్టోబర్ 2025 నాటికి Windows 10 సపోర్ట్ నిలిపేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కంప్యూటర్లకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను జోడించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకురావడం వల్ల, మందగించిన పీసీ మార్కెట్‌ని సమర్థవంతంగా పెంచగలదు.

కంప్యూటర్లు, డేటా స్టోరేజ్ సర్వర్లలో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో ఉపయోగించేందుకు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం రీసైకిల్ చేయబడుతాయి. పనిచేయకుండా పోయిన కంప్యూటర్లు, అయస్కాంతాలుగా మారుతాయని, ఇవి ఎలక్ట్రిక్ మోటార్లలో, విండ్ టర్బైన్లలో వాడుతారని నోవెన్ మాగ్నెటిక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పీటర్ అఫియునీ అన్నారు.