Microsoft: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చాలా మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టబోతోంది. ఇప్పటికే కోడర్లతో పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఉద్యోగులు ఏఐ ధాటికి భయపడి చస్తున్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగాలకు కూడా ఏఐతో ముప్పు ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ ముస్తఫా సులేమాన్ చెప్పారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..
మైక్రోసాఫ్ట్ “ప్రొఫెషనల్-గ్రేడ్ AGI”తో ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌లో పెద్ద వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. హ్యూమన్ ప్రొఫెషనల్స్ చేసే దాదాపు పనిని చేసే మోడల్‌గా దీనిని పేర్కొన్నారు. ఇది మైక్రోసాఫ్ట్ నాలెడ్జ్ వర్కర్ల కోసం సాధారణ పనులను చేయగలిగే శక్తివంతమైన ఏఐ టూల్స్‌ను తన క్లయింట్స్ కోసం అందించే వీలు కల్పిస్తుందని చెప్పారు. వచ్చే కాలంలో శ్రామిక శక్తిలో గణనీయమైన మార్పులు జరుగుతాయని అన్నారు. కంప్యూటర్‌లో తమ పనని చేసే దాదాపు ప్రతీ ఒక్కరూ ప్రమాదంలో ఉన్నారని చెప్పారు. ‘‘కంప్యూటర్ ద్వారా పనులు చేస్తున్న చాలా మంది ఉద్యోగాలు వచ్చే 12-18 నెలల్లో పూర్తిగా ఏఐ భర్తీ చేస్తుంది’’ అని అన్నారు. లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ వంటి ఉద్యోగాలు రిస్క్ జోన్‌లో ఉన్నాయి.
చాలా టెక్ కంపెనీలు ఏఐకి మారుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రాబోయే రెండు మూడు ఏళ్లలో పెద్ద సంస్థలు వర్క్ ఫ్లోను నిర్వహించడంలో ఏఐ ఏజెంట్లు మరింత సమర్థవంతంగా మారుతాయని సులేమాన్ చెప్పారు.
