Lumio Vision 9 (2026) Launch: స్మార్ట్ టీవీ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా లుమియో (Lumio) నుండి ఫ్లాగ్‌షిప్ మోడల్ Vision 9 (2026) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫాస్ట్. ఫ్లూయిడ్. ఫ్లాగ్ షిప్. (Fast. Fluid. Flagship.) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీవీ, ల్యాగ్ సమస్యలు లేకుండా స్మూత్ అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది.
Lumio Vision 9 (2026) పనితీరు, డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అనే నాలుగు ప్రధాన అంశాలపై డిజైన్ చేయబడింది. ఇందులో కంపెనీకి సంబంధించిన “బాస్ పెర్ఫార్మన్స్ ఆర్కిటెక్చర్” ఉపయోగించబడింది. ఇది ప్రాసెసింగ్, మెమరీ, స్టోరేజ్, కనెక్టివిటీ, OS ఆప్టిమైజేషన్‌ను సమన్వయం చేస్తుంది. ఈ టీవీకి MediaTek Pentonic 700 చిప్‌సెట్‌తో పాటు 3GB DDR4 ర్యామ్ ఇవ్వబడింది. కంపెనీ ప్రకారం ఇది ఇతర టీవీలతో పోలిస్తే 2 రెట్లు వేగవంతమైన పనితీరును అందిస్తుంది. Wi-Fi 5 కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది.
గేమింగ్ ప్రియులకు ఈ టీవీ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది 4Kలో 144Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1080pలో 240Hz వరకు సపోర్ట్ చేస్తుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (48–240Hz), ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) తో 9.7ms ఇన్‌పుట్ ల్యాగ్ అందిస్తుంది. HDMI 2.1 & 48Gbps FRL సపోర్ట్ కూడా వీటికి ఉన్నాయి. 55, 65 అంగుళాల మోడల్స్‌లో QD MiniLED ప్యానెల్ ఇవ్వబడింది. ఇది లోకల్ డిమ్మింగ్ & గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. EVA (Enhanced VA) ప్యానెల్ వల్ల కాంట్రాస్ట్, బ్లాక్ లెవల్స్, వ్యూయింగ్ యాంగిల్స్ మెరుగుపడతాయి.
ఈ టీవీ 7000:1 నేటివ్ కాంట్రాస్ట్ రేషియో & 100,000:1 డైనమిక్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. DOPE 2 పిక్చర్ ఇంజిన్, HDR ట్యూనింగ్, Delta E < 1.9 కలర్ అక్యూరసీ, 100% NTSC, 82% Rec.2020 కలర్ కవరేజ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డాల్బీ విజన్, HDR10, HLG వంటి ఫార్మాట్లకు సపోర్ట్ కూడా ఉంది. Vision 9 (2026) లో 50W DGS 2.2 ఆడియో సిస్టమ్ ఇవ్వబడింది. ఇందులో డ్యూయల్ సబ్‌వూఫర్స్, ఫుల్-రేంజ్ డ్రైవర్స్, ట్వీటర్స్‌తో కూడిన హెక్సా డ్రైవర్ సెటప్ ఉంది. ఇది 38Hz వరకు డీప్ బాస్ అందించగలదు. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో క్లియర్ డైలాగ్స్, ఇమ్మర్సివ్ ఆడియో అనుభవం లభిస్తుంది. Vaibhav Sooryavanshi: “ఈ బుడ్డోన్ని ఇప్పుడే టీమిండియాలోకి తీసుకుని తొందర పడకండి”.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇంకా ఇందులో TLDR 2.0 ద్వారా 34 కొత్త AI ఫీచర్లు, ట్రెండింగ్ టాప్ 10, క్యూరేటెడ్ కలెక్షన్స్, యూనిఫైడ్ రేటింగ్స్ అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ సెర్చ్ ద్వారా భాష, జానర్, ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంటెంట్ వెతకవచ్చు. ఇక చెప్పుకోవాల్సిన ఫీచర్ లుమియో లాబ్స్ పరిచయం చేసిన “ప్రాజెక్ట్ నియో” ఫీచర్ ద్వారా వాట్సాప్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారా టీవీతో ఇంటరాక్ట్ కావచ్చు. యూజర్లు తమ ఫోన్ నుంచి లింక్స్ లేదా టెక్స్ట్ క్వెరీస్ పంపితే, టీవీ వాటిని ప్రాసెస్ చేసి వాచ్‌లిస్ట్ రూపొందిస్తుంది.
Lumio Vision 9 (2026) 65-అంగుళాల మోడల్ ధర రూ. 72,999 కాగా, బ్యాంక్ ఆఫర్స్‌తో రూ. 64,999కి లభిస్తుంది. 55-అంగుళాల మోడల్ మే 2026లో అందుబాటులోకి రానుంది. Lumio Vision 7 (2026) 43-ఇంచ్ రూ. 29,999 కాగా, 55-ఇంచ్ రూ. 39,999 గా ఉన్నాయి. ఈ టీవీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఏప్రిల్ 24, 2026 నుండి అమ్మకానికి రానున్నాయి. అన్ని మోడల్స్‌పై 2 సంవత్సరాల వారంటీ అందించబడుతుంది.
