Site icon NTV Telugu

Lightyear 0: వరల్డ్‌లో తొలి సోలార్ కారు.. ప్రత్యేకతలు ఇవే!

Lightyear 0

Lightyear 0

పెట్రోల, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ దృష్టి సారించారు. అధునాతన ఫీచర్లతో రకరకాల వెహికల్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. అయితే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి, సోలార్ కారుని రూపొందించింది. దీని పేరు లైట్‌ఇయర్ జీరో. నయా పైసా ఖర్చు పెట్టకుండానే, ఈ కారు అదనపు మైలేజీని అందిస్తుంది. ఇదే ఇందులో ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్లు బయట చార్జింగ్ స్టేషన్లపై ఆధారపడి ఉండాలి కాబట్టి, ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు సోలార్ ఎలక్ట్రిక్ కారుని సిద్ధం చేశారు.

60 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండే ఈ లైట్‌ఇయర్ జీరో కారు స్వహతాగా ఓ ఎలక్ట్రిక్‌ కారు. సింగిల్‌ ఛార్జ్‌తో ఇది 625 కి.మీ.ల మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్‌ సమస్యను అధిగమించేందుకు.. ఈ కార్లకి సోలార్ పవర్‌ను జత చేశారు. రెండు చదరపు మీటర్ల సోలార్‌ ప్యానెళ్లను అమర్చారు. వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్‌ అవుతాయి. ఫలితంగా అదనంగా 50 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇలా వచ్చే అదనపు మైలేజీకి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.

గత ఆరేళ్ల నుంచి ఈ కాన్సెప్ట్‌పై పని చేస్తుండగా.. చివరికి ఇప్పుడు తుది రూపం దాల్చింది. ఈ కారు ధరను 2,50,00 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్‌ మార్కెట్‌లో తామే సింహభాగం ఆక్రమిస్తామని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version