Jio Recharge: మీ కుటుంబ సభ్యులంతా వేర్వేరు జియో సిమ్‌లను వాడుతూ, ప్రతినెల ఒక్కో దానికి విడివిడిగా రీఛార్జ్ చేస్తున్నట్లయితే మీ కోసం జియో (JIO) ఒక మంచి ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.449 రీఛార్జ్‌తో మీ ఇంట్లోని మూడు నెంబర్లను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇది నిజంగా ఒక రీఛార్జ్‌తో మూడు నెంబర్లకు లాభాలు పొందినట్లే. రోజురోజుకు పెరుగుతున్న టారిఫ్ ధరల నేపథ్యంలో ఈ ప్లాన్ మీకు చాలా ఆదా చేస్తుంది. జియో అందిస్తున్న ఈ రూ.449 ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా కేవలం నెలకు రూ.449తో మీ కుటుంబంలోని మూడు నెంబర్లను యాక్టివేషన్‌లో ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల సైకిల్‌తో వస్తుంది. ఇవన్నీ కూడా జియో 9వ యానివెర్సరీ సెలబ్రేషన్ లో భాగంగా అందిస్తుంది.
ఈ ప్లాన్‌తో లభించే ప్రయోజనాల విషయానికి వస్తే.. నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే, ఇందులో మొత్తం 75 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా అయిపోయిన తర్వాత ప్రతి జీబీకి రూ.10 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్‌తో అదనంగా యాడ్ చేసే ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కు 5 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో చేరే ప్రతి అదనపు ఫ్యామిలీ మెంబర్ సిమ్‌కు నెలకు రూ.150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Karur Stampede: పథకం ప్రకారం జరిగిన కుట్ర.. నేడు హైకోర్టులో టీవీకే పిటిషన్‌పై విచారణ!
ఈ ప్లాన్ తీసుకున్న వారికి జియో తన 9వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని అదనపు లాభాలను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా రెండు నెలల జియోహోమ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జొమాటో గోల్డ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ తోపాటు ఒక నెల జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే AJIO నుంచి రూ.1,000 షాపింగ్‌పై రూ.200 తగ్గింపు, అలాగే 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్న ఎలిజిబుల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభిస్తుంది.
