Jio Diwali Offer: ఈ పండుగ సీజన్లో ఇళ్లలో వై-ఫై వాడే వినియోగదారులకు రిలయన్స్ జియో ఊహించని బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. ‘జియోహోమ్ ఫ్రీడమ్ ఆఫర్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా.. కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో ఏకంగా 5 నెలల పాటు ఉచితంగా హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెళ్లు, ఓటీటీ సేవలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఎన్ని నెలలకు డబ్బులు చెల్లిస్తే అంతవరకే సేవలు అందుతాయి. కానీ జియో తీసుకొచ్చిన పండుగ ధమాకాలో 10 నెలల సేవలకు బిల్లు కడితే, అదనంగా మరో 5 నెలల వ్యాలిడిటీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. నెలకు రూ.666 చొప్పున 10 నెలల కాలానికి సుమారు రూ.6,660 చెల్లిస్తే చాలు.. పూర్తి 15 నెలల పాటు నిరంతరాయంగా వై-ఫై సేవలు అందుతాయి. అంటే చివరి 5 నెలలకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఇది సాధారణ మొబైల్ రీఛార్జ్ కాదని, ఇంట్లో జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్ ఉపయోగించే జియోహోమ్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించాలి.
ఒక్క మిస్డ్ కాల్‌తో ఆఫర్ ఎలా పొందాలంటే?
ఈ పండుగ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎంతో సులభం..
1. మీ జియోహోమ్ కనెక్షన్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8219582195 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.
2. కాల్ కట్ అయిన వెంటనే మీ నంబర్‌కు ఒక నిర్ధారణ ఎస్సెమ్మెస్ (SMS) అందుతుంది.
3. ఆ మెసేజ్‌లో ఇచ్చిన లింక్, సూచనల ప్రకారం రీఛార్జ్ పూర్తి చేసి 5 నెలల అదనపు వ్యాలిడిటీని పొందవచ్చు.
4. వేరే నంబర్ల నుంచి కాకుండా కేవలం రిజిస్టర్డ్ నంబర్ ద్వారానే మిస్డ్ కాల్ ఇవ్వాలి. ప్రక్రియ మొదలుపెట్టే ముందు MyJio యాప్‌లో మీ అకౌంట్ అర్హతను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
1,000 లైవ్ ఛానెళ్లు.. పాపులర్ ఓటీటీలు ఫ్రీ
ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ డేటాతోనే ఆగదు. 15 భాషల్లో ఏకంగా 1,000కు పైగా డిజిటల్ లైవ్ టీవీ ఛానెళ్ల ప్రసారాలు ఉచితంగా చూడొచ్చు. ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి టాప్ ఓటీటీ యాప్స్ ఉచిత సబ్స్క్రిప్షన్లు కూడా అందుతాయి. ‘జియోటీవీ+’ యాప్ సాయంతో ఒకే సెట్-టాప్ బాక్స్‌తో ఇంట్లోని రెండు స్మార్ట్ టీవీల్లో ఒకేసారి వినోదాన్ని వీక్షించే వెసులుబాటు ఉండటం విశేషం. కొత్తగా జియోహోమ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికీ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. రూ.2,122 చెల్లించి 2 నెలల ప్లాన్ తీసుకుంటే.. మరో నెల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తోంది. అంటే రెండు నెలల ఖర్చుతో మూడు నెలల పాటు 100Mbps వేగంతో సూపర్ ఫాస్ట్ వై-ఫైని పొందవచ్చు. లాంగ్-టర్మ్ ఇంటర్నెట్ ఖర్చును భారీగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇది తిరుగులేని అవకాశం అని చెబుతున్నారు.

