కేవలం రూ.5,999లకే ఇన్ని ఫీచర్స్ ఏంటయ్యా..? కొత్త Itel Zeno 20 లాంచ్!
- 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే
- Octa-core T7100 ప్రాసెసర్
- మూడు సంవత్సరాల పాటు ఫ్లూయెన్సీ గ్యారంటీ
- IP54 రేటింగ్, యాంటీ-డ్రాప్ కేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itel Zeno 20: ఐటెల్ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇదివరకు విడుదలైన Zeno 10 మొబైల్ కు సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. రగ్గడ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్ప్లాష్, డస్ట్ ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉండటం ప్రత్యేకత. అంతేకాక యూజర్లకు భద్రత కోసం ప్రత్యేక యాంటీ-డ్రాప్ కేస్ ను కూడా అందిస్తున్నారు. మరి ఇన్ని ఫీచర్లున్న ఈ మొబైల్ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..
Itel Zeno 20లో 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో Octa-core T7100 ప్రాసెసర్ ఉంది. దీనికి కంపెనీ మూడు సంవత్సరాల పాటు ఫ్లూయెన్సీ గ్యారంటీ ఇస్తోంది. ఇది తాజా ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్ పై నడుస్తుంది. అలాగే ఇందులో Aivana 2.0 వాయిస్ అసిస్టెంట్ అందించారు. ఇది హిందీ వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుంది. యూజర్లు దీని ద్వారా యాప్స్ ఓపెన్ చేయడం, వాట్సాప్ కాల్స్ చేయడం, లెక్కలు పరిష్కరించడం, క్యాప్షన్లు క్రియేట్ చేయడం వంటి పనులు చేయవచ్చు.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
Ravi Teja : మాస్ జాతర.. సెప్టెంబర్ లో కూడా లేదు… రిలీజ్ ఎప్పుడంటే
ఈ ఫోన్‌లో 13MP రియర్ కెమెరా (HDR సపోర్ట్, LED ఫ్లాష్), 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. DTS సౌండ్ సపోర్ట్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ లో 5000mAh బ్యాటరీ Type-C ఛార్జింగ్‌తో అందించబడింది. అలాగే ఈ మొబైల్ లో అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 3GB / 4GB RAM (5GB / 8GB వర్చువల్ RAM తో), 64GB / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Pooja Pal: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నేను హత్యకు గురైతే వారే బాధ్యులు..!
ఈ కొత్త ఐటెల్ Zeno 20లో Find My Phone, Landscape Mode, Dynamic Bar వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తోపాటు ప్రత్యేక మైక్రోSD స్లాట్ కూడా ఉంది. అలాగే డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS వంటి ముఖ్యమైన ఆప్షన్లు కల్పించారు. ఇక ధర విషయానికి వస్తే.. Itel Zeno 20 ఆగస్టు 25, 2025 నుండి అమెజాన్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇది స్టార్లిట్ బ్లాక్, స్పేస్ టైటానియం, అరోరా బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. ఇక ధరల పరంగా 64GB + 3GB+5GB RAM వేరియంట్ రూ. 5,999 (250 లాంచ్ డిస్కౌంట్‌తో) లభ్యం అవుతుంది. అలాగే, 128GB + 4GB+8GB RAM వేరియంట్ రూ. 6,899 (300 లాంచ్ డిస్కౌంట్‌తో) అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?