iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
- iQOO త్వరలో Neo 11S స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసే అవకాశం..
- MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌కు కస్టమైజ్ చేసిన (Underclocked) వెర్షన్ ఉండొచ్చని లీక్..
- 2K రిజల్యూషన్ డిస్ప్లేతో కొత్త దేశీయ డిస్ప్లే టెక్నాలజీ ఉపయోగించే అవకాశం. 9,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో భారీ బ్యాటరీ బ్యాకప్
- 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Neo 11S: వివో (vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQOO) త్వరలో Neo సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11Sను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, తాజా లీక్‌ల ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి.
కస్టమైజ్డ్ చిప్సెట్:
ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, iQOO Neo 11Sలో MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌కు ప్రత్యేకంగా ట్యూన్ చేసిన (Underclocked) వెర్షన్‌ను ఉపయోగించనున్నారు. ఇది స్టాండర్డ్ Dimensity 9500తో పోలిస్తే కొద్దిగా తక్కువ క్లాక్ స్పీడ్‌తో పనిచేసినా, iQOO సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్లతో మంచి పనితీరును అందిస్తుంది.
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
2K డిస్ప్లే, 9,000mAh+ బ్యాటరీ:
లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్లో 2K రిజల్యూషన్ డిస్ప్లే ఉండనుంది. కొత్త దేశీయ డిస్ప్లే టెక్నాలజీతో తయారైన ప్యానెల్‌ను ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా 9,000mAh కంటే ఎక్కువ బ్యాటరీను అందించనున్నట్లు సమాచారం. ఇది గత మోడల్‌తో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్. అలాగే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి.
ధర:
గత లీక్‌ల ప్రకారం.. iQOO Neo 11S ఆగస్టులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర CNY 3,000 (రూ.42,000)గా ఉండొచ్చని సమాచారం. 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB వేరియంట్లలో అందుబాటులోకి రావొచ్చు. iQOO Neo 11Sను లైట్ వైట్ (Light White), షాడో బ్లాక్ (Shadow Black), విండ్ ఛేజర్ (Wind Chaser) అనే మూడు రంగుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!