Site icon NTV Telugu

iQOO TWS Air 3 Pro: 50dB ANC, DeepX 3.0 స్టీరియో సౌండ్లతో TWS ఎయిర్ పాడ్స్ లాంచ్!

Iqoo Tws Air 3 Pro

Iqoo Tws Air 3 Pro

iQOO TWS Air 3 Pro: iQOO TWS Air 3 Proను కంపెనీ తాజాగా చైనాలో iQOO Z10 Turbo+ 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు విడుదల చేసింది. ఈ TWS హెడ్‌సెట్ కలిపి గరిష్టంగా 47 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 12mm డ్రైవర్స్ ఉండి, గరిష్టంగా 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్ట్ చేస్తాయి. వీటితోపాటు, iQOO 10,000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో కూడిన పవర్ బ్యాంక్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో బిల్ట్-ఇన్ కేబుల్, L-ఆకార రీచార్జబుల్ USB Type-C పోర్ట్ డిజైన్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఇక ఈ iQOO TWS Air 3 Pro చైనా ధర 199 CNY అంటే సుమారు రూ. 2,400గా నిర్ణయించారు. ఇవి స్టార్ డైమండ్ వైట్, స్టార్ యెల్లో కలర్ ఆప్షన్లలో వివో చైనా e-store లో అందుబాటులో ఉంది. అలాగే ఇవి iQOO Z10 Turbo+ 5G తో కలిపి కొనుగోలు చేస్తే ధర 159 CNY అంటే సుమారు రూ.1,900 మాత్రమే పడుతుంది. ఇక iQOO 22.5W 10,000mAh పవర్ బ్యాంక్ స్టార్రి యెల్లో రంగులో 99 CNY అంటే సుమారు రూ.1,200కి లభ్యం అవుతుంది. మరి ఈ కొత్త iQOO TWS Air 3 Pro స్పెసిఫికేషన్స్ ను చూసేద్దామా..

Film Industry Workers Strike: సినీ కార్మికుల సమ్మె.. కానరాని పరిష్కారం!

iQOO TWS Air 3 Pro స్పెసిఫికేషన్స్:

డిజైన్: సాంప్రదాయ in-ear డిజైన్, సిలికాన్ ఇయర్‌టిప్స్.

డ్రైవర్స్: 12mm డైనమిక్ డ్రైవర్స్.

ANC: 50dB వరకు అడాప్టివ్ ANC, ట్రాన్స్‌పరెన్సీ అండ్ మైల్డ్ మోడ్‌లు.

మైక్రోఫోన్స్: కాల్ నాయిస్ రిడక్షన్ కోసం 3 మైక్రోఫోన్స్.

ఆడియో టెక్నాలజీ: DeepX 3.0 స్టీరియో సౌండ్.

Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!

గేమింగ్ మోడ్: 44ms లో-లాటెన్సీ.

కనెక్టివిటీ: Bluetooth 6.0, మల్టీ-డివైస్ కనెక్షన్, SBC, AAC, LC3 ఆడియో కోడెక్స్.

బ్యాటరీ లైఫ్: ఒక్క ఛార్జ్‌తో ఇయర్‌బడ్స్ 9.5 గంటలు, కేసుతో కలిపి అయితే 47 గంటలు.

రేటింగ్: IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్.

బరువు: ఒక్క ఇయర్‌బడ్ – 3.8g, కేసుతో కలిపి – 38g.

Exit mobile version