NTV Telugu Site icon

iQOO Neo 10R: లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో ఐకూ నుంచి కొత్త ఫోన్ విడుదల..

Iqoo

Iqoo

ఐకూ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. స్టన్నింగ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా iQOO స్మార్ట్‌ఫోన్ iQOO Neo 10R ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. iQOO నియో 10R క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 5G ప్రాసెసర్‌ తో వస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. మొదటిది 8GB RAM + 128GB స్టోరేజ్ తో, రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్ తో వస్తుంది. 12GB RAM మోడల్ 12GB వర్చువల్ RAM కి సపోర్ట్ చేస్తుంది.

Also Read:Amrutha: ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై స్పందించిన అమృత..

iQOO నియో 10R 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 OIS ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. iQOO నియో 10R 80W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. 6400 mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది.

Also Read:DGP: డీజీపీని కలిసిన రాజ లింగమూర్తి భార్య.. సీబీఐ విచారణ కోరుతూ వినతి

ఇందులో 1.54mm సైడ్ బెజెల్స్, IR బ్లాస్టర్ ఉంది. ఇది IP65 దుమ్ము, నీటి నిరోధకతతో వస్తుంది. iQOO Neo 10R అన్ని వేరియంట్లపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,999 గా నిర్ణయించింది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.28,999, 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999గా కంపెనీ నిర్ణయించింది.