Site icon NTV Telugu

రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

Iqoo 15r

Iqoo 15r

iQOO 15R Sale: భారత మార్కెట్లో ఐక్యూ (iQOO) తన తాజా మిడ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐక్యూ 15R (iQOO 15R)ను లాంచ్ చేసింది. ఇందులో 144Hz AMOLED డిస్‌ప్లే, 7600mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ గేమింగ్, హెవీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చింది. ఇందులో 6.59 అంగుళాల 1.5K (1260×2750 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మరియు వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్‌గా అనుభవించవచ్చు.

144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

పనితీరు పరంగా ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ను అమర్చారు. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, హై పర్ఫార్మెన్స్ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. 8GB/12GB ర్యామ్ వేరియంట్లతో పాటు 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీర్ఘకాల గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 6.5K IceCore VC కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP Sony LYT-700V ప్రైమరీ సెన్సార్ OIS సపోర్ట్‌తో ఉంటుంది. ఇది లో-లైట్ ఫోటోగ్రఫీ, స్టేబుల్ వీడియోలకు సహాయపడుతుంది. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ విస్తృత దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 7600mAh భారీ బ్యాటరీ. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.

Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!

భారత మార్కెట్లో ఐక్యూ 15R ధర 8GB + 256GB వేరియంట్‌కు రూ. 44,999గా నిర్ణయించారు. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 47,999 కాగా, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 52,999గా ఉంది. లాంచ్ ఆఫర్‌గా HDFC & Axis బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 1,899 విలువైన iQOO/Vivo TWS ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్ డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

Exit mobile version