iQOO 15 Ultra: iQOO తొలిసారిగా తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ‘అల్ట్రా’ మోడల్‌ను తీసుకురాబోతోంది. iQOO లైనప్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన, ఖరీదైన ఫోన్‌గా నిలవనుంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌ను టీజర్ల ద్వారా పరిచయం చేయగా, తాజాగా పూర్తి డిజైన్‌తో పాటు కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది. అధికారిక లాంచ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా, ఫిబ్రవరి తొలి వారంలోనే ఇది విడుదల కానుందని iQOO నిర్ధారించింది. కాగా, iQOO 15 Ultra డిజైన్, దాని సోదర మోడల్ iQOO 15తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో పెద్ద స్క్వేర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్, స్పష్టంగా కనిపించే కెమెరా సెన్సర్లు, అలాగే కొత్తగా హారిజాంటల్ లైట్ స్ట్రిప్ ఉన్నాయి. మధ్య భాగంలో హనీకాంబ్ డిజైన్‌తో ఇది ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ రెండు సై-ఫై కోడ్ నేమ్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. ఇవి 2049 కోల్డ్ బ్లూ, 2077 ఫ్లోయింగ్ ఆరెంజ్ తో పాటు గేమింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు సైడ్ ఫ్రేమ్‌పై షోల్డర్ బటన్స్‌ను కూడా అందించారు.
Read Also: Subhas Chandra Bose Jayanti: “జై హింద్”.. నేతాజీ గురించి ఆసక్తికర విషయాలు..
అయితే, ఈ డిజైన్ మొత్తం చూసినప్పుడు, iQOO 15 Ultra పూర్తిగా గేమింగ్, పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టి రూపొందించిన ఫోన్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ROG లేదా RedMagic లాంటి ఫోన్లంత పూర్తిగా గేమింగ్ స్టైల్ కాకపోయినా, ప్రీమియం లుక్‌తో పాటు గేమింగ్ టచ్‌ను సమతుల్యంగా కలిపినట్టుగా కనిపిస్తోంది. పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ నిజంగా సంచలనంగా మారనుంది. కంపెనీ వెల్లడించిన AnTuTu బెంచ్‌మార్క్ స్కోరు 4.5 మిలియన్లకు మించి ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాదు, ఇది ఫోన్ యొక్క గరిష్ట సామర్థ్యం కాదని, ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది.
Read Also: Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం.. ప్రజలకు ఇక్కట్లు
ఇక, కూలింగ్ సిస్టమ్ విషయంలో కూడా iQOO 15 Ultra ప్రత్యేకతను చూపిస్తోంది. ఇది తన సెగ్మెంట్‌లోనే అతి పెద్ద యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 17 × 17 × 4 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఫోన్‌లో వేడి త్వరగా బయటకు వెళ్లేలా డిజైన్ చేశారు. ఎయిర్ ఇన్‌టేక్ వెనుక కెమెరా మాడ్యూల్ కింద ఉండగా, ఎగ్జాస్ట్ సైడ్ ఫ్రేమ్‌పై ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలం గేమింగ్ చేసినా ఫోన్ వేడెక్కకుండా స్థిరమైన పని తీరును అందించగలుగుతుంది. అయితే, స్టోరేజ్ విషయంలో iQOO 15 Ultra UFS 3.1 టెక్నాలజీతో రానుంది. మెమరీ వేరియంట్స్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ నుంచి ప్రారంభమై, 24GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వరకూ ఉండనుంది. ఇది ఈ ఫోన్‌ను నిజమైన పవర్‌హౌస్‌గా మార్చే అంశం.
Read Also: Oscar Nominations 2026 : ఆస్కార్స్ నామినేషన్ 2026 ఫైనల్ లిస్ట్ ఇదే..
అలాగే, ఇప్పటికీ కొన్ని స్పెసిఫికేషన్లు రహస్యంగానే ఉన్నప్పటికీ, iQOO 15 Ultra పూర్తిగా పెర్ఫార్మెన్స్‌ను కేంద్రంగా చేసుకుని రూపొందుతోందన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్, దీర్ఘకాల పని తీరు కోసం అవసరమైన అన్ని హార్డ్‌వేర్ అంశాలను ఇందులో జోడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుందని మాత్రమే అధికారికంగా నిర్ధారించారు. భారత్‌లో విడుదలపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, భారత మార్కెట్‌లోకి వస్తే గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీదారుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. హెవీ పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లు ఈ ఫోన్‌పై తప్పక దృష్టి పెట్టాల్సిందే.
