Site icon NTV Telugu

iQOO 15 Pre Bookings: లాంచ్‌కు ముందే ఐకూ 15 ప్రీ-బుకింగ్‌లు.. ఫ్రీ ఇయర్‌బడ్‌లు, ఏడాది అదనపు వారంటీ!

Iqoo 15 Launch

Iqoo 15 Launch

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఐకూ 15 ఫోన్‌ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ప్రీ-బుకింగ్‌లకు అద్భుతమైన స్పందన దక్కిందని కంపెనీ చెబుతోంది. ఐకూ 15 అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పేర్కొంది. అయితే ఎన్ని ప్రీ-ఆర్డర్లు వచ్చాయో మాత్రం ఐకూ వెల్లడించలేదు.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ నవంబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీ-బుకింగ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ iQOO TWS 1e ఇయర్‌బడ్‌ని ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫోన్‌పై ఏడాది అదనపు వారంటీని కూడా ఇస్తోంది. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి కంపెనీ ఐకూ 15 ఫోన్‌ను ముందుగానే డెలివరీ చేస్తుంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ధర రూ.65,000 నుంచి రూ.70,000 మధ్య ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ విభాగంలోని ఇతర ఫోన్‌ల ధర రూ.70,000 కంటే ఎక్కువగా ఉంది. అంటే OnePlus 15, Realme GT 8 Pro కంటే తక్కువ ధరకు iQOO 15ను కంపెనీ లాంచ్ చేస్తుంది.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. అవే స్పెసిఫికేషన్లతో భారత్ వేరియెంట్ కూడా లాంచ్ అవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.85-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16తో వస్తుండగా.. ఐదు అప్‌డేట్‌లను కంపెనీ అందించనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ హ్యాండ్‌సెట్ 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో రానుంది.

Exit mobile version