iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone Duo vs Galaxy Z Fold 8: యాపిల్ ఎట్టకేలకు తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ (iPhone Duo)ను మార్కెట్లోకి తెచ్చి టెక్ ప్రపంచాన్ని మైమరిపిస్తోంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు లాంచ్ అయిన ఈ ప్రీమియం డివైజ్, డిజైన్ నుంచి ధర వరకు ప్రతీ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 3 లక్షలుగా ఉండటం విశేషం. ఐఫోన్ డ్యూయోకు ప్రధాన ప్రత్యర్థిగా మార్కెట్లో అప్పటికే ఉన్న శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 (Galaxy Z Fold 8) సేల్స్‌లో దూసుకుపోతోంది. దీని ధర రూ. 1.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గెలాక్సీ ఫోల్డ్ 8 ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ఐఫోన్ డ్యూయో అక్టోబర్ చివరి నుంచి సేల్స్‌కు రానుంది. మరి ఈ రెండు దిగ్గజ ఫోల్డబుల్ ఫోన్లలో దేని ప్రత్యేకతలు ఏమిటో, రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలేమిటో చూద్దాం.
స్లిమ్ విషయంలో శామ్‌సంగ్‌దే పై చేయి..
చేతిలో పట్టుకున్నప్పుడు లేదా జేబులో పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ విషయంలో శామ్సంగ్ కాస్త ముందంజలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కేవలం 201 గ్రాముల బరువుతో ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. ఫ్లెక్స్ టైటానియం చాసిస్, ఆర్మర్ ఫ్లెక్స్ హింజ్‌తో తయారైన ఈ ఫోన్ అన్ఫోల్డ్ చేసినప్పుడు 4.5 మిమీ, ఫోల్డ్ చేసినప్పుడు 9.7 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీని కవర్ స్క్రీన్ 5.5 అంగుళాలు ఉంటుంది. మరోవైపు, ఐఫోన్ డ్యూయో 254 గ్రాముల బరువుతో కాస్త బరువుగా అనిపిస్తుంది. ఇది గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్, పింగాణీ కవచం (సెరామిక్ షీల్డ్) రక్షణతో పాటు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. దీని 5.4 అంగుళాల అవుటర్ డిస్ప్లే క్లోజ్ చేసినప్పుడు రెగ్యులర్ ఐఫోన్‌లాగే అనిపిస్తుంది. లైట్ వేట్, స్లిమ్ డిజైన్ కావాలనుకునే వారికి శామ్సంగ్, కాస్త సాలిడ్, ఐరన్-క్లాడ్ బిల్డ్ కావాలనుకునే వారికి యాపిల్ సరైన ఛాయిస్.
Also Read
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్ డేట్ ఫిక్స్.. 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా
- OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
- Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
- Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
డిస్ప్లే వివరాలు ఇవే..
ఇక, డిస్ప్లే విషయానికి వస్తే.. రెండు ఫోన్లలోనూ లోపలి భాగంలో 7.6 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్నప్పటికీ, రెండింటి డిస్ప్లే డిజైన్ ఫిలాసఫీ పూర్తిగా వేరు. శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 8 స్క్రీన్‌ను 4:3 ఆస్పెక్ట్ రేషియోతో, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇచ్చింది. యాపిల్ ఐఫోన్ డ్యూయో కూడా 120Hz ప్రోమోషన్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 7.6 అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ను అందిస్తోంది. అయితే, యాపిల్ ఈ స్క్రీన్ కింద సెల్ఫీ కెమెరాను దాచిపెట్టి (అండర్-డిస్ప్లే కెమెరా) పంచ్-హోల్ లేకుండా పూర్తి స్క్రీన్ అనుభూతిని ఇస్తోంది. అంతేకాకుండా, స్క్రీన్ మడత మార్క్ (క్రీజ్) తక్కువగా కనిపించడానికి నాన్-టెక్స్చర్ కోటింగ్‌ను ఉపయోగించింది.
పెర్ఫార్మెన్స్ దేనికవే సాటి..
పెర్ఫార్మెన్స్ విషయంలో రెండూ దేనికవే సాటి. ఐఫోన్ డ్యూయోలో అత్యాధునిక 2-నానోమీటర్ ప్రాసెసర్‌పై తయారైన A20 ప్రో చిప్సెట్ వాడారు. ఇందులో 6-కోర్ CPU, 7-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. వేడిని తగ్గించడానికి యాపిల్ ఇందులో కస్టమ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చింది. శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 8 లో క్వాల్కమ్ టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5 for Galaxy) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 16GB RAM, 1TB స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
రెండు ఫోన్ల కెమెరాలు ఇలా..
కెమెరా విభాగంలో యాపిల్ ఐఫోన్ డ్యూయోలో 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా (2x ఆప్టికల్ జూమ్‌తో), 48-మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ సిస్టమ్‌ను ఇచ్చింది. ఇందులో ప్రత్యేక టెలిఫోటో లెన్స్ లేదు. కానీ, అవుటర్ స్క్రీన్‌ను వ్యూఫైండర్‌గా వాడుతూ వెనుక కెమెరాతోనే స్పష్టమైన సెల్ఫీలు తీసుకునే సదుపాయం ఉంది. శామ్సంగ్ కూడా ఈ మోడల్లో కాస్త హుందాగా వ్యవహరిస్తూ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌నే అందించింది.
బ్యాటరీ విషయంలో తడబడుతున్న యాపిల్..
బ్యాటరీ పరంగా శామ్సంగ్ 4,800mAh బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పక్కా గణాంకాలతో అందించగా, యాపిల్ ఎప్పటిలాగే కెపాసిటీని చెప్పకుండా డ్యూయల్-బ్యాటరీ ఆర్కిటెక్చర్ ఉపయోగించినట్లు తెలిపింది. ఈ ఐఫోన్ డ్యూయో లోపలి స్క్రీన్‌పై 31 గంటలు, బయటి స్క్రీన్‌పై 44 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని, 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుందని యాపిల్ పేర్కొంది.
ధరలో భారీ వ్యత్యాసం..
ధర విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 బేస్ వేరియంట్ (12GB/256GB) ధర రూ. 1,79,999 కాగా, టాప్ వేరియంట్ (16GB/1TB) ధర రూ. 2,39,999 వరకు ఉంది. శామ్సంగ్ లో అత్యంత ఖరీదైన ఫోల్డ్ 8 ఆల్ట్రా మోడల్ ధర రూ. 2,59,999 గా ఉంది. కానీ ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధరే ఏకంగా రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే శామ్సంగ్ టాప్-ఎండ్ మోడల్ కంటే ఐఫోన్ డ్యూయో బేస్ మోడల్ దాదాపు రూ. 60,000 వరకు ఖరీదైనది. మీ ప్రాధాన్యత తక్కువ ధర, తేలికైన డిజైన్ అయితే శామ్సంగ్ ఫోల్డ్ 8 ఉత్తమమైనది. అలా కాకుండా బడ్జెట్ పరిమితి లేకుండా యాపిల్ బ్రాండ్, సరికొత్త ఫోల్డబుల్ టెక్నాలజీ అనుభూతిని పొందాలనుకుంటే ఐఫోన్ డ్యూయో బెస్ట్ ఆప్షన్.
తాజావార్తలు
-
Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
-
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
-
Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!