iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
- యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక ప్రకటన
- ఐఫోన్ 17 సిరీస్‌కు భారీ డిమాండ్
- ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఔట్ ఆఫ్ స్టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here Is Why iPhone 17 Out Of Stock: సాధారణంగా ‘యాపిల్’ కొత్త ఐఫోన్ సిరీస్ మార్కెట్లోకి వచ్చినపుడు.. పాత మోడళ్ల ధరలు తగ్గడం ఆనవాయితీ. ధరలు తగ్గడంతో యాపిల్ లవర్స్ పాత మోడళ్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. 18 సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం ఉండగానే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఐఫోన్ 17’ సిరీస్ మోడళ్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అనేక ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా ఐఫోన్ 17 మోడళ్లు ‘ఔట్ ఆఫ్ స్టాక్’గా మారాయి.
ఐఫోన్ 17 సిరీస్ అనూహ్య డిమాండ్ వెనుక ప్రధాన కారణంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన తాజా వ్యాఖ్యలే అని టెక్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడంతో యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యయం గణనీయంగా పెరిగిందని టిమ్ కుక్ ఇటీవల వెల్లడించారు. భవిష్యత్తులో కంపెనీ లాభదాయకంగా కొనసాగాలంటే కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చారు. సీఈఓ ప్రకటన అనంతరం ఐప్యాడ్లు, మ్యాక్బుక్లు, మ్యాక్ కంప్యూటర్ల ధరలను యాపిల్ పెంచింది. అయితే ప్రస్తుతం ఐఫోన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో తదుపరి ధరల పెంపు ఐఫోన్లకే వర్తించే అవకాశం ఉందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 17 సిరీస్ ధరలు త్వరలోనే పెరగవచ్చనే ప్రచారం వినియోగదారులను ముందుగానే కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తోంది.
Also Read
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
ధరలు పెరిగిన తర్వాత కొనుగోలు చేయడం కంటే ప్రస్తుతం ఉన్న ధరలకే ఐఫోన్ 17ను కొనడం మంచిదని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకే భారీ సంఖ్యలో ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు దేశవ్యాప్తంగా అనేక యాపిల్ రిటైల్ స్టోర్లలో కూడా ఐఫోన్ 17 స్టాక్ క్షణాల్లో అమ్ముడవుతోంది. ప్రస్తుతం చాలా చోట్ల స్టాక్ అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.
కొత్త మోడల్ మార్కెట్లోకి రాకముందే పాత మోడల్‌కు ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడటం యాపిల్ బ్రాండ్ ప్రత్యేకతకు నిదర్శనంగా టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ మీరు కూడా ఐఫోన్ 17 కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు లేదా సమీపంలోని యాపిల్ స్టోర్లలో స్టాక్ అందుబాటును ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది. ఎందుకంటే కొత్త స్టాక్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
-
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
-
AA23: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!