Site icon NTV Telugu

Iphone 16 Price Drop: నెవర్ బిఫోర్ డీల్ అమ్మ.. అతి తక్కువ ధరకు ఐఫోన్ 16!

Apple Iphone 16 Price Cut

Apple Iphone 16 Price Cut

టాటా అనుబంధ ఈ-కామర్స్‌ సంస్థ ‘క్రోమా’ ప్రస్తుతం గొప్ప డీల్‌లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం ‘ఐఫోన్ 16’పై క్రోమా గొప్ప డీల్‌లను అందిస్తోంది. క్రోమాలో అతి తక్కువ ధరకు ఐఫోన్ 16ను మీ సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం.

అమెరికా టెక్ దిగ్గజం ‘యాపిల్’కు చెందిన ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ మునుపటి కంటే చాలా సరసమైన ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రూ.12,910 తగ్గింపు అనంతరం రూ.66,990కి లభిస్తుంది. అదనంగా మీరు ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ లేదా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ.4,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్‌లను కలిపితే.. ఐఫోన్ 16 ఫోన్ రూ.62,990కి మీ సొంతమవుతుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ఈఎంఐ నెలకు కేవలం రూ.3,153 నుండి ప్రారంభమవుతుంది. ఇక ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ మీద అయితే ఈ ధర భారీగా తగ్గనుంది. ఐఫోన్ 16 సెప్టెంబర్ 2024లో లాంచ్ అయింది. ఆ సమయంలో ధర రూ.79,900గా ఉంది.

Also Read: 5G సపోర్ట్, బెస్ట్ ఫీచర్స్.. 7040mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A11+ భారత్‌లో లాంచ్!

ఐఫోన్ 16 ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్ట బ్రైట్నెస్ 2,000 నిట్‌లు. ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. సిరామిక్ షీల్డ్ డిస్‌ప్లేను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యాపిల్ కొత్త 3nm A18 బయోనిక్ చిప్ ద్వారా రన్ అవుతుంది. ఈ చిప్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఇందులో ChatGPT ఇంటిగ్రేషన్, సిరి, జెమిని-ఆధారిత రైటింగ్ టూల్స్ ఉన్నాయి. ఐఫోన్ 16 ఐదు రంగులలో (నలుపు, తెలుపు, గులాబీ, టీల్, అల్ట్రామెరైన్) లభిస్తుంది. 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 48MP ఫ్యూజన్ ప్రధాన కెమెరా ఉంది. 12MP మాక్రో కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 4K డాల్బీ విజన్ HDR వీడియోను రికార్డ్ చేసే 12MP సెల్ఫీ కెమెరా ఉంది.

Exit mobile version