Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!

Iphone 16 And Iphone 17e

Iphone 16 And Iphone 17e

Apple iPhone Offers: కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్న టెక్ ప్రియులకు అదిరిపోయే వార్త. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నిర్వహిస్తున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్‌లో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉన్న ఐఫోన్ 16తో పాటు సరికొత్త ఐఫోన్ 17e మోడళ్లపై కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, కూపన్లతో ధరలు మరింత దిగివస్తున్నాయి.

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్..

ఐఫోన్ 16 (128GB వేరియంట్) అసలు ధర మార్కెట్‌లో రూ.89,900 ఉండగా, అమెజాన్ సేల్‌లో ఇది నేరుగా రూ. 76,999కే లిస్ట్ అయింది. అంటే ఎలాంటి ఆఫర్లు లేకుండానే ఫ్లాట్‌గా రూ.12,901 తగ్గింపు లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న యూజర్లు రూ.500 ప్రత్యేక కూపన్‌ను వర్తింపజేస్తే, దీని స్టార్టింగ్ ప్రైజ్ దాదాపు రూ.72,249కి తగ్గే అవకాశం ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లింపులు జరిపితే రూ.3,849 వరకు క్యాష్‌బ్యాక్ పొందే వెసులుబాటు ఉంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ రూపంలో దాదాపు రూ.2,161 వరకు అదనంగా ఆదా అవుతుంది.

ఐఫోన్ 17e పైనా భారీ తగ్గింపు

కొత్త జనరేషన్ ఫీచర్లు కోరుకునే వారికి ఐఫోన్ 17e (256GB వేరియంట్) సైతం ఆకర్షణీయమైన ధరలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.79,900 కాగా, సేల్‌లో రూ.71,999కే అందుబాటులో ఉంచారు. అదనంగా లభించే రూ. 1,000 కూపన్ డిస్కౌంట్‌ను యూజ్ చేస్తే దీని ధర రూ.70,999కి చేరుతుంది. అలాగే ఎస్‌బీఐ కార్డుల ద్వారా రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డుతో నో-కాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే బ్యాలెన్స్ వాడితే రూ. 3,599 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పించారు.

కొనే ముందు ఈ విషయాలు చూడండి..

ఈ ఆఫర్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్‌లు అన్నీ ఎంచుకునే పేమెంట్ విధానం, బ్యాంక్ కార్డులపై ఆధారపడి ఉంటాయి. ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో చెక్‌అవుట్ పేజీలో కనిపించే రూల్స్‌ను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి, మీ బడ్జెట్, స్టోరేజ్ అవసరాలకు సరిపోయే మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.