11-అంగుళాల FHD డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?

  • ఇన్ఫినిక్స్ XPad 30e టాబ్లెట్‌ను బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్
  • ఇందులో 11-అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లే
  • MediaTek Helio G-సిరీస్ ప్రాసెసర్‌..
Infinix Xpad 30e

Infinix Xpad 30e

Infinix XPad 30e: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) టాబ్లెట్ లైన్‌అప్‌ను కొనసాగిస్తూ కొత్తగా Infinix XPad 30e టాబ్లెట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ టాబ్లెట్ విద్యార్థులు, ఎంటర్టైన్మెంట్, రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని లాంచ్ చేశారు.

Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!

Infinix XPad 30e లో 11-ఇంచ్ Full HD+ LCD డిస్‌ప్లే అందించారు. ఈ టాబ్లెట్ స్లిమ్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఇది MediaTek Helio G-సిరీస్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. రోజువారీ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఇందులో 7000mAh భారీ బ్యాటరీ అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకునేలా బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

టాబ్లెట్‌లో రియర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అందించారు. 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాలు వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్, ఫోటోలు తీసుకోవడానికి ఇవి సరిపోతాయి. టాబ్లెట్‌లో 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. Wi-Fi, Bluetooth వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనికి డ్యూయల్ స్పీకర్లు ఉండటం వల్ల మంచి ఆడియో అనుభవం లభిస్తుంది.

Sikandar Raza: ఏదైనా జరగొచ్చు, 3 మ్యాచ్‌లలో 2 గెలిస్తే.. సూపర్‌-8కు ముందు సికందర్ రజా హెచ్చరిక!

Infinix XPad 30e టాబ్లెట్‌ను కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో రూ. 13,000కు లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ ధర వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించారు. త్వరలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.