Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Xpad 30: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Infinix Xpad 30 పేరుతో కొత్త ట్యాబ్లెట్‌ను ఫిలిప్పీన్స్‌లో లాంచ్ చేసింది. ఇందులో 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh భారీ బ్యాటరీ, MediaTek Helio G88 ప్రాసెసర్ వంటి ఫీచర్లను అందించింది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచింది. ఈ కొత్త ట్యాబ్లెట్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
Infinix Xpad 30 ట్యాబ్లెట్‌ను కంపెనీ ఫిలిప్పీన్స్ మార్కెట్లో రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేసింది.
Also Read
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
4GB RAM + 128GB స్టోరేజ్
6GB RAM + 128GB స్టోరేజ్
ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర PHP 14,999గా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.22,000. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే Cloudline Blue, Lunar Lilac, Stellar Grey అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ట్యాబ్లెట్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
Infinix Xpad 30 డిస్ప్లే
ఈ ట్యాబ్లెట్లో 11 ఇంచుల FHD+ IPS LCD డిస్ప్లే అందించారు. దీని రిజల్యూషన్ 1200 × 1920 పిక్సెల్స్ కాగా, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. డిస్ప్లే రక్షణ కోసం Panda MN228 కవర్ గ్లాస్‌ను ఉపయోగించారు. Low Blue Light, Flicker Free సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. పెద్ద స్క్రీన్ కావడంతో వీడియోలు చూడటం, ఆన్లైన్ క్లాసులు, వెబ్ బ్రౌజింగ్ వంటి పనులకు ఉపయోగపడుతుంది.
ప్రాసెసర్, RAM, స్టోరేజ్
Infinix Xpad 30లో MediaTek Helio G88 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 12nm ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు.
కెమెరా ఫీచర్లు
ఫొటోలు, వీడియో కాల్స్ కోసం ఈ ట్యాబ్లెట్లో ముందు, వెనుక రెండింటిలోనూ 8MP కెమెరాలను అందించారు.
రియర్ కెమెరా: 8MP
ఫ్రంట్ కెమెరా: 8MP
రియర్ LED ఫ్లాష్ సపోర్ట్
ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాల్స్, సాధారణ ఫొటోగ్రఫీకి ఇవి ఉపయోగపడతాయి.
7200mAh భారీ బ్యాటరీ
Infinix Xpad 30లో 7,200mAh బ్యాటరీని అందించారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్లో IP52 రేటింగ్ అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే 4G, LTE, 3G, Wi-Fi, Bluetooth 5.2 సపోర్ట్ ఉన్నాయి. Android 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. అలాగే AI ఆధారిత ఫీచర్లను కూడా అందించారు.
తాజావార్తలు
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
-
RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
-
CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
-
Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!