Site icon NTV Telugu

7.2mm స్లిమ్ డిజైన్‌, ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో Infinix NOTE Edge లాంచ్.. ధర ఎంతంటే..?

Infinix Note Edge

Infinix Note Edge

Infinix NOTE Edge Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్ (Infinix) మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుక వచ్చింది. గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని నోట్ (NOTE) సిరీస్‌లో కొత్త మోడల్‌గా ఇన్‌ఫినిక్స్ నోట్ ఎడ్జ్ (Infinix NOTE Edge)ను లాంచ్ చేసింది. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ డిస్ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది.

ఈ డివైస్ లో తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100 5G) ప్రాసెసర్ ను ఉపయోగించడమే కాకుండా.. కొత్త హై-డెన్సిటీ బ్యాటరీ ఆర్కిటెక్చర్‌ను కూడా తీసుకవచ్చింది. ఈ మొబైల్ కేవలం 7.2mm మందం, 185 గ్రాముల బరువుతో స్లిమ్ లుక్‌లో వచ్చింది. “3D కర్వ్డ్” డిజైన్‌తో పాటు “పెరల్ లైట్ రిప్ప్లే షాడో” ఫినిష్ ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ లూనార్ టైటానియం, స్టెల్లార్ బ్లూ, షాడో బ్లాక్, సిల్క్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. సిల్క్ గ్రీన్ వేరియంట్ పాలియూరితేన్ ప్రాసెస్‌తో లెదర్‌లాంటి టెక్స్చర్‌ను ఇస్తుంది.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?

మొబైల్ 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.87mm అల్ట్రా-న్యారో బెజెల్స్‌తో విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, అలాగే IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కలదు. ఆడియో కోసం JBL ట్యూన్ చేసిన డ్యువల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. AnTuTu V11లో 8.1 లక్షలకు పైగా స్కోర్ సాధించిందని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ కోసం UPS 3.0 AI టెక్నాలజీ ఉంది. ఇది బేస్‌మెంట్‌లు, సబ్‌వేలు వంటి తక్కువ సిగ్నల్ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది.

నోట్ ఎడ్జ్ లో ఇన్‌ఫినిక్స్ ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద 6500mAh బ్యాటరీ ఉంది. స్లిమ్ బాడీలో ఇంత పెద్ద బ్యాటరీ ఉండటానికి అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ఉపయోగించారు. “సెల్ఫ్-రిపేరింగ్” బ్యాటరీ సిస్టమ్‌తో 2000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% సామర్థ్యం ఉంటుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 27 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. ఇంకా దీనికి 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Tamannaah : ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!

ఇక కెమెరా భాగంలో వెనుక 50MP కస్టమైజ్డ్ మెయిన్ కెమెరా ఉంది. ఇది లో-లైట్ ఫోటోగ్రఫీకి అనుకూలంగా రూపొందించారు. “లైవ్ ఫోటో” మోడ్ ద్వారా ఫోటోతో పాటు చిన్న వీడియో, ఆడియో కూడా క్యాప్చర్ చేయవచ్చు. AI ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. సైడ్ బటన్ ద్వారా యాక్సెస్ చేసే FOLAX AI అసిస్టెంట్ స్క్రీన్ అనాలిసిస్, ట్రాన్స్‌లేషన్, సమ్మరైజేషన్ వంటి పనులు చేస్తుంది. అలాగే మొబైల్ కి 3 మెజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు హామీ ఇచ్చింది కంపెనీ. మొబైల్ ప్రారంభ ధర USD 200 (రూ. 18,100)గా ఉన్నాయి. ధరలు ప్రాంతాలను బట్టి మారవచ్చు. ఇప్పటికే పలు దేశాల్లో పలు దేశాల్లో ఈ ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి.

Exit mobile version