Site icon NTV Telugu

7.2mm మందం, “3D Curved” డిజైన్‌, 50MP రియర్ కెమెరా Infinix NOTE Edge 5G లాంచ్.. ధర ఎంతంటే?

Infinix Note Edge 5g

Infinix Note Edge 5g

Infinix NOTE Edge 5G Launch: ఇన్ఫినిక్స్ (Infinix) సంస్థ భారత మార్కెట్లో తన కొత్త ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix NOTE Edge 5G)ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డిమెంసిటీ 7100 ప్రాసెసర్‌ తో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలిచింది. కంపెనీ ప్రకారం, ఈ చిప్‌సెట్‌ తో ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 7.5 లక్షలకుపైగా స్కోర్ సాధించింది. గేమింగ్ కోసం 90FPS వరకు సపోర్ట్ అందిస్తుంది.

India Super 8 Schedule: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు ఫిక్స్.. మ్యాచ్‌ల పూర్తి జాబితా ఇదిగో!

“AI పవర్స్ యువర్ ప్లే” పేరుతో పలు గేమింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పెర్ఫార్మన్స్ మోడ్, మ్యాజిక్ వాయిస్ చెంజర్, నెట్వర్క్ ఎన్హన్స్మెంట్ బైపాస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 7.2mm మందంతో, 185 గ్రాముల బరువుతో స్లిమ్‌గా రూపొందించారు. “3D Curved” డిజైన్‌తో లూనార్ టైటానియం, స్టెల్లార్ బ్లూ, సిల్క్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

6.78 అంగుళాల 1.5K AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ ప్రత్యేకత. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో పాటు IP65 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. JBL ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది ఇప్పటివరకు ఇన్ఫినిక్స్ ఫోన్‌లలో అతిపెద్ద బ్యాటరీగా పేర్కొన్నారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 27 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీలో “సెల్ఫ్-రిపేరింగ్” టెక్నాలజీ ఉపయోగించారని, 2000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది.

NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!

ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా ఇచ్చారు. లో-లైట్ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెన్సార్ ఇది. “లైవ్ ఫోటో” మోడ్‌తో పాటు AI ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. “FOLAX” AI అసిస్టెంట్ స్క్రీన్ విశ్లేషణ, అనువాదం, సమ్మరీ వంటి పనులు చేయగలదు. 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

ముఖ్య స్పెసిఫికేషన్లు:
* 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
* మీడియాటెక్ డిమెంసిటీ 7100 ప్రాసెసర్.
* 6GB / 8GB RAM, 128GB / 256GB స్టోరేజ్.
* 50MP రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా.
* 6500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.
* IP65 రేటింగ్.
* స్టీరియో స్పీకర్లు (JBL).

ధరలు:
* 6GB + 128GB వేరియంట్ రూ. 21,999
* 8GB + 128GB వేరియంట్ రూ. 23,999
* 8GB + 256GB వేరియంట్ రూ. 25,999

Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ & కాశ్మీర్

ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 25 నుంచి ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. లాంచ్ ఆఫర్లలో ఐసీసీఐ, SBI కార్డులతో రూ. 2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ. 2000 తగ్గింపు లభిస్తుంది.

Exit mobile version