లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!

  • గేమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Infinix GT 50 Pro భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్
  • 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్
  • ప్రెజర్-సెన్స్ జీటీ ట్రిగ్గర్స్, 6437 చదరపు మిల్లీమీటర్ల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్
  • 50MP OIS + EIS ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా
  • 6500mAh బ్యాటరీ, 45W వైర్డ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్
Infinix Gt 50 Pro

Infinix Gt 50 Pro

Infinix GT 50 Pro Launched: మొబైల్ గేమర్లను లక్ష్యంగా చేసుకుని ఇన్ఫినిక్స్ (Infinix) సరికొత్త గేమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ GT 50 Proను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ప్రవేశపెట్టిన ‘న్యూ జీటీ ఎకోసిస్టమ్’ (New GT Ecosystem)లో భాగంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక ఫిజికల్ గేమింగ్ కంట్రోల్స్, అధునాతన కూలింగ్ టెక్నాలజీ, శక్తివంతమైన ప్రాసెసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదుపాయాలతో ఆకట్టుకుంటోంది.

కన్సోల్ కంట్రోల్స్ & ఏరోడైనమిక్ డిజైన్

ఈ స్మార్ట్‌ఫోన్ లో ప్రధానంగా చేపలసింది దీని ‘ఓపెన్-కట్ ప్రెజర్-సెన్స్ జీటీ ట్రిగ్గర్స్’ (Pressure-Sense GT Triggers). ఈ డ్యూయల్ ప్రెజర్ మెకానికల్ షోల్డర్ బటన్లు మొబైల్ గేమింగ్‌లో కన్సోల్ స్థాయి అనుభవాన్ని అందిస్తాయి. ఇవి లైట్, హెవీ, స్లైడింగ్ ఇన్‌పుట్‌లను గుర్తించగలవు. యూజర్లు ప్రతి ట్రిగ్గర్‌కు 4 మ్యాపింగ్ పాయింట్లతో పాటు 10 లెవల్స్ ప్రెజర్ సెన్సిటివిటీని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. గేమింగ్ లో కాకుండా వీటిని స్క్రీన్‌షాట్లు, స్క్రీన్ రికార్డింగ్ లేదా Folax AI అసిస్టెంట్‌ను ఆన్ చేసే షార్ట్‌కట్‌లుగానూ ఉపయోగించవచ్చు. డిజైన్ పరంగా.. అంతర్గత లిక్విడ్ కూలింగ్‌ను చూపించే పారదర్శక ‘పైప్‌లైన్ విండో డిస్‌ప్లే’తో పాటు 14 రకాల దృశ్యాలు, 8 కస్టమైజబుల్ రంగులను సపోర్ట్ చేసే ‘మెకానికల్ లైట్ వేవ్స్’ ఆర్జీబీ (RGB) లైటింగ్ సెటప్‌ను దీని వెనుక భాగంలో అమర్చారు.

హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్

ఎక్కువ సమయం గేమ్స్ ఆడినప్పుడు మొబైల్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేక కూలింగ్ ఆర్కిటెక్చర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 6437mm² డయాఫ్రమ్‌తో కూడిన మైక్రో-పంప్ లిక్విడ్ కూలింగ్ నెట్‌వర్క్ ఉంది. పైజోఎలెక్ట్రిక్ సిరామిక్ హీట్ పంప్ నిమిషానికి 6.5 మి.లీ కూలెంట్‌ను పంపుతూ ప్రధాన భాగాల నుంచి వేడిని వేగంగా లాగేస్తుంది. అదనపు యాక్సెసరీగా 12W యాక్టివ్ థర్మోఎలెక్ట్రిక్ కూలర్ (GT Magcharge Cooler 2.0) అందుబాటులో ఉంది. ఇది నేరుగా మదర్‌బోర్డుకు విద్యుత్ అందించే బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వడం వల్ల బ్యాటరీ వేడెక్కకుండా కాపాడుతుంది.

144Hz 1.5K AMOLED డిస్‌ప్లే

ఈ మొబైల్ 6.78 అంగుళాల 1.5K AMOLED (1208 x 2644 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 2800Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కంటి రక్షణ కోసం 2304Hz PWM డిమ్మింగ్, స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని ఉపయోగించారు. గేమింగ్‌లో శబ్దాల దిశను స్పష్టంగా గుర్తించేందుకు డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.

ప్రాసెసర్ & కెమెరా

ఈ Infinix GT 50 Pro మొబైల్ లో 3.25GHz క్లాక్ స్పీడ్ కలిగిన 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, Mali-G720 MC6 GPUతో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఫ్రేమ్స్ స్థిరత్వం కోసం మీడియాటెక్ ఫ్రేమ్ రేట్ కన్వర్టర్ (MFRC) టెక్నాలజీని, ఆన్‌లైన్ గేమింగ్‌లో లేటెన్సీని తగ్గించడానికి ప్రత్యేక N1 నెట్‌వర్క్ చిప్‌ను ఇందులో పొందుపరిచారు. ఈ ఫోన్ కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ వంటి ప్రముఖ ఈ-స్పోర్ట్స్ గేమ్‌లను 144 FPS వద్ద రన్ చేయగలదు. కెమెరా విభాగంలో OIS EIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ & సాఫ్ట్‌వేర్ ఫీచర్లు

ఈ సరికొత్త గేమింగ్ మొబైల్ లో 6500mAh బ్యాటరీని మాత్రమే అమర్చారు. గేమింగ్ ఫోన్ కు ఈ బ్యాటరీ కాస్త మైనస్ అని చెప్పవచ్చు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16తో పనిచేస్తుంది. దీనికి 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను సంస్థ హామీ ఇచ్చింది. ఇంకా గేమ్స్ ఆడేటప్పుడు డిస్ట్రబెన్స్ లేకుండా ఉండేందుకు ‘హార్డ్‌కోర్ ఈ-స్పోర్ట్స్ మోడ్’, గేమింగ్ మ్యాక్రోల కోసం ‘AI స్మార్ట్ ట్రిగ్గర్’, రియల్-టైమ్ స్ట్రాటజీ అలర్ట్స్, ‘AI మ్యాజిక్ వాయిస్ ఛేంజర్’ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ధర, ఆఫర్లు

భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ GT 50 Pro స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999గా నిర్ణయించారు. ఇది బ్లాక్ అబిస్ (Black Abyss), రెడ్ బ్లేజ్ (Red Blaze) రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 30 నుంచి అధికారిక అమ్మకాలు మొదలవుతాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా.. కొనుగోలుదారులకు GT NX స్టేషన్, GT NX కంట్రోలర్, GT కూలింగ్ ఫ్యాన్ కమ్ ఛార్జర్ మరియు GT 50 Pro మ్యాగ్‌సేఫ్ కవర్‌తో కూడిన రూ. 24,999 విలువైన ఉచిత గేమింగ్ ఎకోసిస్టమ్ బాక్స్ లభిస్తుంది. ఇంకా సెలెక్టెడ్ బ్యాంకుల కార్డులపై రూ. 5,000 తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) లు కూడా కలిగి ఉంది.