NTV Telugu Site icon

Earphones: అదిరిపోయే ఫీచర్లతో.. రూ. వెయ్యి ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఇవే!

Bluetooth

Bluetooth

స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న దాదాపు అందరు ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. మీరు తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రూ. వెయ్యి ధరలో అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్, బోట్, ఒప్పో, రియల్ మీ కంపెనీలకు చెందిన ఇయర్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

OnePlus Bullets Wireless Z2 Bluetooth

ఫ్లిప్ కార్ట్ లో వన్ ప్లస్ బ్రాండ్ కు చెందిన వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జడ్ 2 బ్లూటూత్ పై 43 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 2299గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ 30గంటలు. 10 నిమిషాల్లో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

boAt Rockerz 255 Pro+

బోట్ కంపెనీ ప్రొడక్ట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఫ్లిప్ కార్టులో boAt Rockerz 255 Pro+ ఇయర్ ఫోన్స్ పై 74 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 3990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 998కే దక్కించుకోవచ్చు. వాటర్, స్వెట్ రెసిస్టెంట్ తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ 60 గంటలు. 60 గంటల ప్లే టైమ్ తో వస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ ఫోన్స్ కావాలనుకునే వారు దీనిపై ఓ లుక్కేయండి.

realme Buds Wireless 3 Neo:

రియల్ మి బ్రాండ్ కు చెందిన రియల్ మి బడ్స్ వైర్ లెస్ 3 నియో ఇయర్ ఫోన్స్ పై 48 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2499 కాగా ఆఫర్లో 1299కే వచ్చేస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో వెయ్యి ధరలోనే సొంతం చేసుకోవచ్చు. 32 గంటల ప్లే టైమ్ తో వస్తుంది. క్వాలిటీ వాయిస్ కోసం AI ENC నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది.