200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!

  • చైనాలో Pura X View ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్..
  • 6.39 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • పనితీరు కోసం Kirin 9030S చిప్‌సెట్
  • వెనుక భాగంలో 200MP మెయిన్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్..
Huawei Pura X View

Huawei Pura X View

Huawei Pura X View: హువావే (Huawei) చైనాలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Pura X Viewను విడుదల చేసింది. HarmonyOS 7.0పై పనిచేసే ఈ ఫోన్‌లో Kirin 9030S చిప్‌సెట్, 200MP కెమెరా, భారీ 7,000mAh బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

OLED డిస్‌ప్లే:

Huawei Pura X Viewలో 6.39 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 1,320 × 2,232 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,160Hz PWM డిమ్మింగ్, 300Hz టచ్ శాంప్లింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. Kunlun Glass ప్రొటెక్షన్ కూడా ఉంది.

200MP కెమెరా:

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 200MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, రెండో తరం Red Maple ప్రైమరీ కలర్ కెమెరా ఉన్నాయి. మెయిన్ కెమెరాకు OIS సపోర్ట్ ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

7,000mAh బ్యాటరీ:

ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. Kirin 9030S చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 12GB RAM, గరిష్ఠంగా 1TB స్టోరేజ్ అందుబాటులో ఉంది. IP68, IP69 రేటింగ్స్‌తో పాటు Wi-Fi 7, Bluetooth 6.0, NFC, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. Xiaoyi AI అసిస్టెంట్‌ను కూడా అందించారు.

ధర ఎంతంటే?

Huawei Pura X View అమ్మకాలు సెప్టెంబర్ 9 నుంచి చైనాలో ప్రారంభం కానున్నాయి. లీపింగ్ షాడో రెడ్, లినెన్ గ్రే, ఫాంటమ్ నైట్ బ్లాక్, జీరో డిగ్రీ వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

* 12GB + 256GB: CNY 5,999 (రూ.84,000).
* 12GB + 512GB: CNY 6,999 (రూ.98,000).
* 12GB + 1TB: CNY 8,499 (రూ.1.19 లక్షలు).