Huawei Nova 16 SE: హువావే (Huawei) నుండి కొత్త Huawei Nova 16 SE స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 5న చైనాలో అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటికే కంపెనీ టీజర్ల ద్వారా ఫోన్ ను వెల్లడించగా.. లైవ్ ఇమేజ్‌లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. 8,500mAh బ్యాటరీ, Kirin 8020 ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో లాంచ్ కానుంది.
డిజైన్:
కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్ ప్రకారం.. Nova 16 SE వెనుక భాగంలో పెద్ద హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇందులో మూడు కెమెరా రింగులు త్రిభుజాకార లేఅవుట్‌లో అమర్చారు. ఈ డిజైన్ Honor Power 2తో పాటు iPhone 17 Pro సిరీస్‌ను గుర్తు చేస్తుంది. ముందు భాగంలో సన్నని బెజెల్స్‌తో కూడిన సెంటర్ పంచ్-హోల్ డిస్‌ప్లేను అందించారు. ప్రస్తుతం చెర్రీ బ్లాసమ్ స్నో స్కై కలర్‌ను మాత్రమే కంపెనీ చూపించింది. అయితే Weiboలో లీకైన ఫోటోల ప్రకారం ఈ ఫోన్ బ్లాక్, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రాసెసర్:
లీకుల ప్రకారం ఈ మొబైల్ లో 6.84 అంగుళాల LTPS డిస్‌ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్ ను అందించనుండగా, గరిష్టంగా 8,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పనితీరు కోసం Huawei సొంతంగా అభివృద్ధి చేసిన Kirin 8020 చిప్‌సెట్ను ఉపయోగించనున్నారు.
బ్యాటరీ & కెమెరా:
ఈ ఫోన్‌లో ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీ అందించనున్నారు. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని లీకులు చెబుతున్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ రియర్ కెమెరాను అందించనున్నారు. దీనికి Huawei ప్రత్యేకమైన రెడ్ మాపుల్ ఇమేజింగ్ టెక్నాలజీ (Red Maple Imaging Technology) సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
ధర:
Huawei Nova 16 SE చైనాలో ఆగస్టు 5న మధ్యాహ్నం 2:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) అధికారికంగా విడుదల కానుంది. ప్రస్తుతం కంపెనీ చైనాలోని Vmall ద్వారా ప్రీ-రిజర్వేషన్లను ప్రారంభించింది. ప్రారంభంలో 256GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లిస్ట్ అయింది. లీకుల ప్రకారం.. ఈ ఫోన్ ధర సుమారు CNY 2,000 (రూ.28,000) ఉండే అవకాశం ఉంది. ఇతర స్టోరేజ్, కలర్ వేరియంట్ల వివరాలను లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించే అవకాశం ఉంది.

