Site icon NTV Telugu

Kirin 9030 Pro చిప్‌తో కొత్త ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ Huawei Mate X7 గ్లోబల్ లాంచ్:.. ధర, ఫీచర్స్ ఇవే..!

Huawei Mate X7

Huawei Mate X7

Huawei Mate X7: హువావే (Huawei) సంస్థ కొత్తగా పుస్తకం శైలిలో ఉన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Huawei Mate X7 ను చైనా తర్వాత ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో కూడా అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ లో అత్యాధునిక Kirin 9030 Pro చిప్‌సెట్, మెరుగైన కెమెరాలు, మంచి OLED డిస్‌ప్లేలు వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం యూజర్స్ ను టార్గెట్ చేస్తుంది.

Nitish Kumar Reddy: నితీశ్‌ కుమార్‌ రెడ్డి హ్యాట్రిక్.. అయినా ఆంధ్రకు నిరాశే!

ఈ కొత్త Mate X7‌లో రెండు OLED స్క్రీన్లు ఉన్నాయి. లోపల 8 అంగుళాల (2210 x 2416 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ LTPO OLED డిస్‌ప్లే ఉండగా.. బయట 6.49 అంగుళాల (1080 x 2444 పిక్సెల్స్) 3D క్వాడ్-కర్వ్డ్ LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఈ రెండు స్క్రీన్లూ 1Hz నుండి 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz (ఇన్‌సైడ్), 300Hz (అవుట్‌సైడ్) గా ఉన్నాయి. బయటి స్క్రీన్‌పై రెండో తరం Kunlun గ్లాస్ రక్షణను అందించారు.

ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో Kirin 9030 Pro చిప్‌సెట్‌ను జతపరిచారు. దీనికి 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అలాగే ఇది HarmonyOS 6.0 ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP RYYB ప్రైమరీ కెమెరా (f/1.4–f/4.0 వేరియబుల్ అపెర్చర్, OIS), 40MP అల్ట్రా వైడ్ RYYB కెమెరా (f/2.2), 50MP టెలిఫోటో RYYB కెమెరా (OIS) లు ఉన్నాయి. ఇక రెండవ తరం Red Maple సెన్సర్‌ను కూడా కలిగి ఉంది. లోపల, బయటి స్క్రీన్లలో 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

Union Cabinet: మారనున్న ఉపాధి హామీ పథకం పేరు.. కొత్త నేమ్ ఇదే!

ఈ ఫోల్డబుల్ మోడల్‌కు IP58 + IP59 రేటింగ్ ఉంది. ఇది నీరు, దుమ్ము నిరోధకతలో మంచి స్థాయి రక్షణను అందిస్తుంది. ఇక కనెక్టివిటీ, సెన్సర్ల విషయంలోకి వస్తే.. Wi-Fi, Bluetooth 6, BeiDou, Galileo, NavIC, GPS మొదలైన నావిగేషన్ సపోర్ట్, NFC, USB Type-C పోర్ట్ ఉంటాయి. ఈ గ్లోబల్ Mate X7 మోడల్‌లో 5300mAh బ్యాటరీను అందించారు. అలాగే దీనికి 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. చైనా Collector’s Edition‌లో 5600mAh ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీను అందించారు.

Huawei Mate X7 యూరప్‌లో ఒకే ఒక్క 16GB RAM + 512GB స్టోరేజ్ వెర్షన్‌కు EUR 2,099 (రూ. 2,20,000) ధరతో లభిస్తుంది. ఇది బ్లాక్, బ్రోకేడ్ వైట్, నెబుల రెడ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. చైనాలో ఈ మోడల్‌ను నవంబర్‌లో విడుదల చేసారు. అక్కడ ధర CNY 12,999 (రూ. 1,63,500) నుండి ప్రారంభమైంది.

Exit mobile version