Site icon NTV Telugu

HTC Vive Eagle: వాయిస్ కమాండ్స్‌తో ఫోటోలు, వీడియోలు, ట్రాన్స్‌లేషన్ ఫీచర్లు.. AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ లాంచ్!

Htc Vive Eagle

Htc Vive Eagle

HTC Vive Eagle: HTC సంస్థ తన మొదటి డిస్ప్లే లేని AI స్మార్ట్ గ్లాసెస్ HTC Vive Eagle ను లాంచ్ చేసింది. ఈ వేర్‌బుల్ డివైస్‌లో గూగుల్ జెమినీ లేదా OpenAI GPT (ప్రస్తుతం బీటాలో) ఆధారంగా పనిచేసే ఇన్-బిల్ట్ AI అసిస్టెంట్ ఉంటుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా మ్యూజిక్ వినడం, ప్రశ్నలు అడగడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, అలాగే సైన్‌బోర్డులు ఇంకా చిత్రాలను అనువదించడం వంటి పనులు చేయవచ్చు.

ఈ HTC Vive Eagle ధర 15,600 NT డాలర్స్ అంటే సుమారు రూ. 45,500గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది కేవలం తైవాన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇవి కావలిసిన వినియోగదారులు 2020EYEhaus, కొన్ని Taiwan Mobile స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్ బెర్రీ, బ్లాక్, కాఫీ, గ్రే వంటి నాలుగు రంగుల్లో వస్తుంది.

Oppo K13 Turbo Pro: భారీ డిస్కౌంట్‌తో అమ్మకాలను మొదలు పెట్టిన ఒప్పో 7,000mAh బ్యాటరీ కొత్త స్మార్ట్‌ఫోన్!

ఇక ఈ కొత్త HTC Vive Eagle స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ చూసినట్లయితే.. ఇది ఒక వేఫెరర్ స్టైల్ AI స్మార్ట్ గ్లాసెస్. లెన్స్‌తో కలిపి దీని బరువు 48.8 గ్రాములు మాత్రమే. ఇక లెన్స్ లేకుండా కేవలం 42.8 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇందులో Snapdragon AR1 Gen 1 చిప్‌సెట్, 4GB ర్యామ్, 32GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇది 3024 x 4032p రిజల్యూషన్‌లో ఫోటోలు, అలాగే 1512 x 2016p రిజల్యూషన్‌లో 30fps వద్ద వీడియోలు రికార్డ్ చేస్తుంది. లెన్స్‌లు Zeiss UV400 ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి.

ఇక ఆడియో కోసం ఇందులో బీమ్‌ఫార్మింగ్ మైక్రోఫోన్ అరే, 2 ఓపెన్-ఇయర్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు ఎడమవైపు ఉన్న LED లైట్ ఆన్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో 235mAh బ్యాటరీ ఉంటుంది. కంపెనీ ప్రకారం ఇది 36 గంటలకు పైగా స్టాండ్‌బై టైమ్, అలాగే 4.5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుంది. మాగ్నెటిక్ చార్జింగ్ కేబుల్ ద్వారా 1-50% చార్జ్ 10 నిమిషాల్లో, 80% చార్జ్ 23 నిమిషాల్లో అవుతుందని తెలిపింది.

Mahindra new SUVs 2025: ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. మహీంద్రా నుంచి 4 కొత్త SUV లు రిలీజ్

ఇక కనెక్టివిటీ కోసం ఇది Wi-Fi 6E, Bluetooth 5.3 సపోర్ట్ చేస్తాయి. అలాగే IP54 రేటింగ్ కలిగి ఉండటం వలన ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఈ AI గ్లాసెస్‌ని ఉపయోగించాలంటే iOS 17.6 లేదా ఆ తర్వాతి వెర్షన్ లేదా ఆండ్రాయిడ్ 10 లేదా ఆ తర్వాతి వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో జత చేయాల్సి ఉంటుంది.

Exit mobile version