HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్‌ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్..
- హెచ్ పీ హైపర్‌ఎక్స్ ఓమెన్ 16
- AMD రైజెన్ చిప్సెట్
- ల్యాప్‌టాప్ ధర రూ.2,24,999
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెక్నాలజీ సంస్థ HP భారత మార్కెట్లో గేమింగ్ ప్రియుల కోసం కొత్త HyperX Omen 16 Valorant Limited Edition ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ప్రముఖ గేమ్ డెవలపర్ Riot Games భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన AMD Ryzen 7 ప్రాసెసర్, NVIDIA GeForce RTX 5060 GPU, 240Hz డిస్ప్లే వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు.
ధర
భారత్‌లో ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ ధర రూ.2,24,999గా నిర్ణయించారు. ఇది Black, Black Chrome కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు దీనిని.. HP అధికారిక ఆన్లైన్ స్టోర్, Amazon, Flipkart, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Also Read
- Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
- Telegram, Signal: వాట్సాప్ యూజర్‌నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
240Hz డిస్ప్లేతో సూపర్ గేమింగ్ అనుభవం
HP HyperX Omen 16లో 16 అంగుళాల IPS డిస్ప్లేను అందించారు.
డిస్ప్లే ముఖ్య ఫీచర్లు:
1920×1200 పిక్సెల్స్ రిజల్యూషన్
240Hz రిఫ్రెష్ రేట్
400 నిట్స్ బ్రైట్నెస్
యాంటీ-గ్లేర్ కోటింగ్
Low Blue Light సపోర్ట్
ఈ డిస్ప్లే వేగవంతమైన గేమింగ్, స్మూత్ విజువల్స్‌ను అందించేందుకు రూపొందించారు.
AMD Ryzen 7, RTX 5060 పవర్
ఈ ల్యాప్‌టాప్‌లో AMD Ryzen 7 8745HX ప్రాసెసర్‌ను అమర్చారు. దీని ప్రత్యేకతలు.. 8 కోర్లు, 16 థ్రెడ్లు, గరిష్టంగా 5.1GHz బూస్ట్ క్లాక్, గ్రాఫిక్స్ కోసం NVIDIA GeForce RTX 5060 GPUను అందించారు. దీంతో AAA గేమ్స్, వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించవచ్చు.
RAM, స్టోరేజ్, AI ఫీచర్లు
ల్యాప్‌టాప్‌లో 16GB DDR5 RAM, రెండు మెమరీ స్లాట్లు, Windows 11 Home ఉన్నాయి. అలాగే OMEN AI Optimization ఫీచర్ ద్వారా గేమింగ్ సమయంలో సిస్టమ్ పనితీరును ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
కనెక్టివిటీ, ఆడియో
కనెక్టివిటీ కోసం ఇందులో.. Wi-Fi, Bluetooth, Gigabit Ethernet, 1 USB Type-C పోర్ట్, 3 USB Type-A పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ జాక్ అందుబాటులో ఉన్నాయి. ఆడియో కోసం HP Audio Boost, HyperX Audio Technology సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లను అందించారు.
Full HD వెబ్‌క్యామ్, ఫాస్ట్ ఛార్జింగ్
వీడియో కాల్స్ కోసం 1080p Full HD వెబ్‌క్యామ్ ను ప్రైవసీ షట్టర్‌తో అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో 83Wh లిథియం-పాలిమర్ బ్యాటరీ ఉంది. HP ప్రకారం, ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనితో పాటు 280W AC పవర్ అడాప్టర్ కూడా లభిస్తుంది.
గేమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్
HyperX Omen 16 Valorant Limited Editionను ముఖ్యంగా Valorant గేమ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, శక్తివంతమైన AMD Ryzen ప్రాసెసర్, RTX 5060 గ్రాఫిక్స్, AI ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్ ప్రీమియం గేమింగ్ అనుభవాన్ని అందించనుంది.
తాజావార్తలు
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్‌ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!