Honor X7c 5G: SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 300% హై వాల్యూమ్ మోడ్‌తో విడుదలకు సిద్దమైన కొత్త స్మార్ట్‌ఫోన్!
- SGS 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్, IP64 రేటింగ్
- 50MP AI మోషన్ సెన్సింగ్ కెమెరా
- Snapdragon 4 Gen 2 (4nm) చిప్సెట్, MagicOS 8.0తో Magic Capsule
- ఎలిగెంట్ ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ రంగుల్లో
- డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300% హై వాల్యూమ్ మోడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X7c 5G: హానర్ (Honor) తన కొత్త మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Honor X7c 5G ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బలమైన నిర్మాణం, అధునాతన ఫీచర్లు, ఇంకా దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వినియోగదారులకు మన్నికైన అనుభవాన్ని అందించబోతోంది. ఈ మొబైల్ లో ప్రత్యేకంగా SGS 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్, IP64 రేటింగ్ కలిగి ఉండడంతో.. మొబైల్ చేతిలో నుండి పడిపోవడం, నీటి చుక్కలు, దుమ్ము వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది.

Also Read
- 8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
- రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
- Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
హానర్ X7c 5G బలమైన బాడీ, అధునాతన రక్షణతో వస్తోంది. ఇది SGS సర్టిఫికేట్ పొందిన 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్ కలిగి ఉంది. అంతేకాదు ఈ మొబైల్ ఏకంగా 3 నిమిషాల ‘వాషింగ్ టెస్ట్’ పాస్ అయింది. దీని వల్ల నీటి చుక్కలు, పొడి మట్టి వంటి వాటి నుంచి ఫోన్ సురక్షితంగా ఉంటుంది. IP64 రేటింగ్ కారణంగా దుమ్ము మరియు నీటి స్ప్లాష్‌లను తట్టుకునే సామర్థ్యం కలిగింది. ఇక బ్యాటరీ విషయంలో 5,200mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ రానుంది. దీనికి 35W SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది వేగంగా చార్జ్ అవుతుంది. ఇక హానర్ ల్యాబ్ టెస్టుల ప్రకారం ఈ మొబైల్ 19 గంటల ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్, 55 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించగలదు. అలాగే Ultra Power-Saving Mode ద్వారా కేవలం 2% బ్యాటరీతో 60 నిమిషాల వరకు వాయిస్ కాల్ చేసే అవకాశం ఉంటుంది.
ఇక మెమరీ విషయానికి వస్తే.. ఇందులో 8GB RAM ఉండి Honor RAM Turbo సాంకేతికతతో అదనంగా 8GB వర్చువల్ RAM లభిస్తుంది. అంటే మొత్తం 16GB RAM అనుభవం లభిస్తుంది. 256GB UFS 3.1 స్టోరేజ్ సౌకర్యం వల్ల సుమారు 60,000 ఫోటోలు నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఆడియో (Sound) అనుభూతి కోసం.. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో సపోర్ట్, 300% హై వాల్యూమ్ మోడ్‌ను అందిస్తుంది.

Honor X7c 5G కెమెరా విభాగంలో 50MP AI మోషన్ సెన్సింగ్ కెమెరా ఉండి, కదలికల సమయంలోనూ స్పష్టమైన ఫోటోలు తీసేలా సాయపడుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 850 nits పీక్ బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లేను అందించనున్నారు. దీనివల్ల చీకటి పరిస్థితుల్లో 2 nits వరకు తక్కువ బ్రైట్‌నెస్‌తో ఐ కేర్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రాసెసర్ పరంగా Snapdragon 4 Gen 2 (4nm) చిప్సెట్, MagicOS 8.0 (Android 14) తో Magic Capsule, Quick Access టూల్స్, Three-finger స్వైప్ షార్ట్‌కట్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Lenovo Tab: డాల్బీ ఆటమ్స్ సౌండ్, 5,100mAh బ్యాటరీ, 4 సంవత్సరాల సెక్యూరిటీతో కొత్త ట్యాబ్ లాంచ్!
డిజైన్ పరంగా.. ఇది ఎలిగెంట్ ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ రంగుల్లో లభిస్తుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా Honor X7c 5G త్వరలో అమెజాన్ ద్వారా లాంచ్ అవనుంది. భారత వెర్షన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, Ultra Power-Saving Mode, 8GB RAM + 8GB వర్చువల్ RAM, రెండు రంగుల ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి.
తాజావార్తలు
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
-
Ramayana: ట్రైలర్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
-
NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు.!
-
Hyderabad: మియాపూర్‌లో విషాదం..! ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!